Leopard Attack: తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన అలిపిరి నడక మార్గలంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఐదేళ్ల బాలుడు కౌశిక్‌పై చిరుత దాడి చేసింది. తన తాతతో కలిసి వెళ్తున్న సమయంలో బాలుడిపై ఈ దాడి జరిగింది. బాలుడిని నోట కరచుకుని పొదల్లోకి లాక్కెళ్లేందుకు చిరుత ప్రయత్నించగా, పక్కనే ఉన్న భక్తులు, పోలీసులు గట్టిగా కేకులు వేస్తూ వెంటపడ్డారు. దీంతో చిరుత భయంతో బాలుడిని అక్కడే వదిలేసి వెళ్లింది. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే భద్రతా సిబ్బంది బాలుడిని తిరుపతి స్విమ్స్‌కు తరలించారు.
విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని, బాలుడికి మెరుగైన చికిత్స అందించేలా చూస్తామని ఈవో వెల్లడించారు.
అలిపిరి నడక మార్గంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..