Tirumala: తిరుమలలో బయటపడిన నయా స్కామ్.. కలర్ జిరాక్స్ టికెట్లతో

| Edited By: Ram Naramaneni

Aug 20, 2024 | 11:42 AM

తిరుమలలో నకిలీ రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వైకుంఠంలోని స్కానింగ్ చేసే రుద్రసాగర్ అనే వ్యక్తి చొరవతో భక్తులు వెళ్తుండగా పూర్తి సమాచారంతో విజిలెన్స్ అధికారులు నిఘా వేశారు. చెన్నైకు చెందిన మోహన్ రాజ్ వద్ద నుంచి నాలుగు టికెట్లకు గాను 11 వేల రూపాయలు వసూలు చేశారు.

Tirumala: తిరుమలలో బయటపడిన నయా స్కామ్.. కలర్ జిరాక్స్ టికెట్లతో
Rudrasagar
Follow us on

తిరుమలలో దళారులకు చెక్ పెట్టే పనిలో ఉన్న టీటీడీ విజిలెన్స్ దళారుల ఆట కట్టిస్తోంది. ఫేక్ టికెట్స్‌తో దర్శనాలు చేయిస్తున్న కేటుగాళ్లకు చెక్ పెడుతోంది. ఇందులో భాగంగా నిఘా పెంచిన టిటిడి విజిలెన్స్ వింగ్ నకిలీ రూ.300 ల ప్రత్యేక దర్శన టికెట్లతో దర్శనాలను వెళుతున్న భక్తులను గుర్తించింది. కలర్‌ జిరాక్స్‌ టికెట్లతో పొంది వైకుంఠంలోకి వెళుతున్న భక్తులను పట్టుకుంది టిటిడి. విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అసలు బండారం బయటపడింది. వైకుంఠంలో స్కానింగ్ చేసే రుద్రసాగర్ అనే వ్యక్తి సాయంతో భక్తులు దర్శనానికి వెళ్లినట్లు గుర్తించారు. చెన్నైకి చెందిన మోహన్ రాజ్‌ అనే భక్తుడను… రుద్రసాగర్ సాయంతో  పాత నేరస్తుడు అమృత యాదవ్ మోసం చేసినట్లు గుర్తించారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం నాలుగు టికెట్లను రూ. 11వేలకు కట్టబెట్టిన రుద్రరాజు, అమృత యాదవ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ నెల 17న నకిలీ టికెట్లతో 35 మంది భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా అమృత యాదవ్ ముఠా శ్రీవారి దర్శనం చేయించినట్లు తేల్చారు. ఒక్కో టికెట్‌కు రూ. 2 వేలు దళారీలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల స్కానింగ్ ఉద్యోగి రుద్రాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా అమృత యాదవ్ పరారీలో ఉన్నాడు. చెన్నైకి చెందిన ఒక ట్రావెల్స్ తో కలిసి ఫేక్ టికెట్లతో భక్తులకు దర్శనాలు చేయిస్తున్నట్లు టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..