తిరుపతి ఎయిర్ పోర్టుతో పాటు స్టాఫ్ క్వార్టర్స్‌కు తాగునీరు నిలిపివేయడంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఇప్పటికే కేంద్ర పౌరవిమానయానమంత్రికి దీనిపై పలు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే బీ కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డి తిరుపతి విమానాశ్రయానికి నీటి సరఫరాను నిలిపివేశారని ఆరోపించిన తరువాత అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమస్యను పరిశీలిస్తామని, విమానాశ్రయంలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగబోదని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
తిరుపతి విమానాశ్రయానికి తాగునీరు నిలిపేయించిన ఘటనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నహసింహారావు కేంద్ర పౌర విమానయానశాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయానమంత్రి జోక్యం చేసుకోవాలని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
We will examine the issue at our end & take necessary action. Passengers & staff at the airport will not face any further inconvenience. https://t.co/6rk6E6vqYN
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) January 13, 2022
తిరుపతి ఎయిర్ పోర్టు ఘటనపై బీజేపీ నేతలు కేంద్రంలోని ఇతర పెద్దలకు కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేత చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎయిర్ పోర్టులోకి ఎంట్రీ ఇవ్వకపోతే తాగునీరు నిలిపేసి టార్గెట్ చేస్తారా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
అయితే ఈ ఘటనపై ఇంకా సదరు వైసీపీ నేత అభినయ్ రెడ్డి కానీ, ఆయన తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. దీంతో ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: Train Ticket Lost: రైలు ప్రయాణానికి ముందు కన్ఫర్మ్ టికెట్ పోతే.. తిరిగి ఇలా తీసుకోండి..
AP Corona Cases: ఏపీలో మరోసారి పెరిగిన కొత్త కోవిడ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం..