Cheetah: తిరుమల కొండ సహా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న చిరుతల సంచారం

Cheetahs : చిరుతల సంచారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తిరుమలలో ఒక్కరోజు రెండు చోట్ల చిరుతలు గుబులు రేపగా, మెదక్‌ జిల్లాలోని గ్రామాల్లో చిరుత భయంతో..

Cheetah: తిరుమల కొండ సహా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న చిరుతల సంచారం
Cheetah

Updated on: Jul 09, 2021 | 3:44 PM

Cheetahs : చిరుతల సంచారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తిరుమలలో ఒక్కరోజు రెండు చోట్ల చిరుతలు గుబులు రేపగా, మెదక్‌ జిల్లాలోని గ్రామాల్లో చిరుత భయంతో జనం బెంబేలెత్తుతున్నారు. తిరుమలలో నిన్న ఒక్కరోజు రెండు సార్లు చిరుతలు ప్రత్యక్షమై భక్తుల్ని భయాందోళనలకు గురిచేశాయి. రెండో ఘాట్‌లో రోడ్డు దాటుతూ చిరుత కనిపించగా, అటుగా వెళ్తున్న వారు చిరుతను సెల్‌ఫోన్‌లో బంధించారు. అదే సమయంలో ఘాట్‌రోడ్డులో చిరుత సంచారంతో… భక్తులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. ఇక నిన్న రాత్రి సన్నిధానం దగ్గర రెండోసారి చిరుత ప్రత్యక్షమైంది. దీంతో అక్కడే ఉన్న టీటీడీ సిబ్బంది, భక్తులు పరుగులు తీశారు. స్థానికులు నివాసముండే బాలాజీనగర్‌ దగ్గర కొద్దిరోజులుగా చిరుత సంచారం చేస్తుండడం కలకలం రేపుతోంది.

కాగా, తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరుగుతున్న సమయంలో ఇలా మృగాల సంచారం కూడా పెరగడంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతల సంచారం పెరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో.. క్రూరమృగాలు తప్పించుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చిరుతల కోసం ట్రాప్‌ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

తిరుమలకు నిత్యం లక్షలాదిమంది భక్తులు వచ్చి దర్శనాలు చేసుకునే నేపథ్యంలో చిరుతల సంచారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. ఇటు తెలంగాణలోనూ చిరుతలు స్వైర విహారం చేస్తున్నాయి. మెదక్‌ జిల్లాలోని శంకరంపేట, చేగుంట, నార్సింగ్‌ మండలాల్లో చిరుత కలకలం సృష్టిస్తోంది. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాల్సిన ఈ కాలంలో ప్రజలు గుంపులుగా వెళ్లి రావడం తప్ప.. వేరే మార్గం కనిపించడంలేదు. అర్జంటుగా అటవీ శాఖ అధికారులు చిరుతల కోసం ట్రాప్‌లు ఏర్పాటు చేయాలంటున్నారు స్థానికులు.

Read also: YS Jagan: బద్వేల్ నియోజయకవర్గానికి ఎప్పుడూ మంచి జరగలేదు : సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి