చిత్తూరు జిల్లా, ఆగస్టు 25: దేశం గర్వించేలా చేసిన చంద్రయాన్ 3 ప్రయోగంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వనిత కూడా భాగస్వామ్యం ఉంది. చంద్రయాన్-3 లో అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కీలకపాత్ర పోషించిన కల్పన మన్ననలు పొందింది. చిత్తూరు జిల్లాలోని నగరి మండలం తడుకు పేటకు చెందిన కల్పన చంద్రయాన్ 3 ఉపగ్రహం జాబిల్లికి సేఫ్‌గా చేరడంతో సొంతూరి కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగింది. కల్పన విషయానికి వస్తే తండ్రి మునిరత్నం చెన్నై హైకోర్టులో అధికారి కావడంతో ఆమె విద్యాభ్యాసం చెన్నైలోనే పూర్తి చేసుకుంది. మద్రాస్ యూనివర్సిటీలో క్రికెట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు ఇంజనీరింగ్ చేసిన కల్పన భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించింది. 2000 లో ఇస్రో నోటిఫికేషన్‌తో రాడార్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన కల్పన.. 2005 లో బెంగళూరులోని సాటిలైట్ సెంటర్ కు బదిలీ అయింది. శాటిలైట్ భవన్‌లో సాటిలైట్ సిస్టమ్స్ ఇంజనీర్ గా విధుల్లో చేరి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చేరిన కల్పన ఇలా తన ఉద్యోగ ప్రస్థానంలో చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌లో భాగస్వామ్య అయింది.
ఉపగ్రహం డిజైన్, హార్డ్ వేర్ తయారీ తరువాత పలు పరీక్షలు పూర్తిచేసి షార్‌కు చేరుకున్న చంద్రయాన్ 3 రాకెట్ సాయంతో నింగిలోకి పంపిన టీంలో కల్పన కీలక పాత్ర పోషించింది. రోజుకో సవాల్‌ను అంకిత భావంతో ఎదుర్కొన్న కల్పన తన పని సామర్థ్యంతో ప్రశంసలు అందుకుంది. నగరి గడ్డలో పుట్టి దేశ కీర్తి ప్రతిష్టలు చాటిచెప్పే ప్రయోగంలో లక్ష్యాన్ని చేరిన కల్పన ను గ్రామం అభినందించింది. తడుకు పేటలోని పాఠశాలలో విద్యార్థులు జాతీయ జెండాతో చంద్రయాన్ సక్సెస్ సంబరాలు జరుపుకోగా కల్పన కుటుంబం, గ్రామం ఆమె గొప్పతనాన్ని కీర్తించింది. చంద్రయాన్ 3 జాబిల్లి యాత్రలో కల్పన సొంతూరు పేరు తెచ్చింది.
దీంతో కల్పన సొంత గ్రామమంతా జయహో నినాదంతో హోరెత్తింది. గ్రామమంతా ఒక్కటై కల్పన కృషిని అభినందించింది. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంది. ప్రపంచం దేశం వైపు చూసేలా చంద్రయాన్ 3 సక్సెస్ లో కీలకంగా రాణించిన కల్పన గ్రామానికి వచ్చినపుడు ఎంతో సందడి చేసేదని జనం నోట వినిపిస్తోంది. ఉన్నతమైన స్థానంలో ఉన్న గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు అండగా నిలిచింది. తడుకు పేట పాఠశాలలో కల్పన విజయాన్ని వేడుకగా జరుపుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామానికే కల్పన కొత్త గుర్తింపు తెచ్చిందని మిఠాయిలు పంచుకుని సంబరాలు మునిగిపోయారు.
కాగా, చంద్రయాన్-3 మిషన్ విజయం సాధించడంతో డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన మాట్లాడుతూ.. ప్రజ్ఞాన్ రోవర్‌లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై తాకిన సమయం చిరస్మరణీయమైన క్షణమని, ఎన్నో సంవత్సరాలుగా తాము చేసిన కష్టానికి విజయం లభించిందని అన్నారు.
Chandrayaan-3’s associate project director Kalpana K shares her excitement and congratulates the whole nation on the success of the mission. She is one of the many remarkable scientists from ISRO who made this feat a reality for over 140 billions of Indians. More power to her… pic.twitter.com/F6LvyHUTvP
— Femina (@FeminaIndia) August 23, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..