ఎవరైనా తిరుమల శ్రీవారికి డబ్బులు, బంగారాన్ని, తలనీలాలను సమర్పిస్తుంటారు. కానీ, శ్రీవారి బంగారాన్నే కొట్టేయాలని చూసి కటకటాల పాలయ్యాడు ఓ బ్యాంక్ ఉద్యోగి. తిరుమల శ్రీవారి పరకామణి బంగారాన్ని చోరీ చేసేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయాడు బ్యాంకు ఉద్యోగి.. పెంచలయ్య అనే ఉద్యోగి చిల్లర నాణేలను తరలించే ట్రాలీలో బంగారం బిస్కెట్‌ను పెట్టి దొంగిలించే యత్నం చేశాడు.. వంద గ్రాముల బంగారం బిస్కెట్ ఎత్తుకెళ్తుండగా అనుమానం వచ్చి విజిలెన్స్ సిబ్బంది అడ్డగించారు.. ఆ తర్వాత తనఖీలు నిర్వహించి బంగారం బిస్కెట్ ను గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.
పరకామణి నుంచి వచ్చేటప్పుడు ట్రాలీ పైప్ లో 100 గ్రాముల బంగారాన్ని పెట్టుకొని వస్తుండగా.. విజిలెన్స్ సంబ్బంది రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు.. విచారణ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.
సాధారణంగా హుండీలను రెండుసార్లు చెక్ చేస్తామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.. చిల్లర నాణేలు తెచ్చే ట్రాలీల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసేటప్పుడు బంగారు కాయిన్ బయట పడిందన్నారు. సీసీ కెమెరా ద్వారా నిందితుడిని విజిలెన్స్ సిబ్బంది గుర్తించిందని తెలిపారు. శ్రీవారి పరకామణి టీటీడీ విజిలెన్స్ నిఘా నీడలో ఉంటుందని.. ఇలాంటివి జరగకుండా మున్ముందు కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..