తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ లో చిన్నారికి ప్రమాదం తప్పింది. 3 వ నంబర్ ఫ్లాట్ ఫామ్ పై పిల్లర్ లో 4 ఏళ్ల సాయి యశస్విని ఇరుక్కు పోయింది. సుమారు గంటకు పైగా నరక యాతన పడింది. చిత్తూరు వెళ్లేందుకు రాజంపేట నుంచి రేణిగుంట చేరుకున్న సాయికుమార్ ఫ్యామిలీ. దాదర్ ఎక్స్ ప్రెస్ లో రేణిగుంటకు చేరుకుకుంది. రాజంపేటకు చెందిన సాయి కుమార్ ఫ్యామిలీ చిత్తూరు వెళ్లే ట్రైన్ కోసం వేచి ఉండగా అక్కడే ఆడుకుంటున్న సాయి యశస్వి ప్రమాదానికి గురైంది. మరి కాసేపట్లో జయంత్ ఎక్స్ ప్రెస్ వస్తుందని ఎదురు చూస్తుండగా అక్కడే ఆడుకుంటున్న సాయి యశస్విని ఐరన్ పిల్లర్ మద్య తలపెట్టి బయటికి రాలేక ఇరుక్కు పోయింది. కేకలు వేస్తూ ఏడ్చింది. బయట రాలేక ఇబ్బంది పడ్డ చిన్నారిని గుర్తించిన తల్లిదండ్రులు, ప్రయాణికులు బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఇనుప కట్టర్ల సహాయంతో పిల్లర్ ని కట్ చేసి పాపని సురక్షితం గా బయటకు తీసారు. సేఫ్ గా చిన్నారిని రైల్వే సిబ్బంది కాపాడడంతో ఊపిరి పీల్చుకున్నారు. చిన్న వయస్సులో పిల్లలు ఒకచోట కుదరుగా ఉండరు. తెలియక వెళ్లి ప్రమాదాల్లో పడుతూ ఉంటారు. అందుకే వారిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. ప్రమాదాలు చెప్పి రావు. అందుకే పేరెంట్స్ అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..