Amit Shah: తిరుపతిలో అమిత్ షా మూడ్రోజుల పర్యటన ఖరారు.. కేంద్ర హోం మంత్రి పర్యటన వివరాలు

|

Nov 12, 2021 | 4:24 PM

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఖరారైంది. తిరుపతిలో మూడు రోజుల పర్యటన నిమిత్తం..

Amit Shah: తిరుపతిలో అమిత్ షా మూడ్రోజుల పర్యటన ఖరారు.. కేంద్ర హోం మంత్రి పర్యటన వివరాలు
Amit Shah
Follow us on

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిరుపతి పర్యటన ఖరారైంది. తిరుపతిలో మూడు రోజుల పర్యటన నిమిత్తం.. శనివారం (ఈనెల 13న) ఆయన తిరుపతికి రానున్నారు. 14న ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ నెల 15న శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అమిత్‌షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

అమిత్ షా తిరుపతి పర్యటన నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల పోలీసు యంత్రాంగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. 

Also Read..

Wedding Reception: నా పెళ్ళికి రండి.. భోజనం చేసి రూ. 7,300 చెల్లించండి .. పిల్లల్ని తీసుకుని రావద్దు.. కండిషన్స్ అప్లై.. ఎక్కడంటే..

Pushpaka Vimanam Review: ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని… వినోదంతో కలిపి సెన్సిటివ్‌గా చెప్పిన ‘పుష్పక విమానం’