Watch Video: 25 పైసల నాణేలతో భారీ జాతీయ పతాకం.. కానిస్టేబుల్ వినూత్న దేశ భక్తి!

దేశభక్తి ఆ కానిస్టేబుల్‌ను ఒక రికార్డు నెలకొల్పేలా చేసింది. జాతీయ పతాకంపై ఉన్న మక్కువ డిఫరెంట్ గా ఆలోచించేందుకు కారణమైంది. ఇందులో భాగంగానే 25 పైసల నాణేలతో జాతీయ పతాకం రూపొందించి అందరి చేత శభాష్ అనిపించుకునేలా చేసింది. తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న..

Watch Video: 25 పైసల నాణేలతో భారీ జాతీయ పతాకం.. కానిస్టేబుల్ వినూత్న దేశ భక్తి!
Head Constable Created National Flag With 25 Paisa Coins

Edited By:

Updated on: Jan 27, 2026 | 8:26 AM

సురేష్ రెడ్డి.. తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. వృత్తిరీత్యా ఖాకీ యూనిఫాంలో విధులు నిర్వర్తించే సురేష్ రెడ్డికి జాతీయ పతాకం అంటే ఎనలేని మక్కువ. తనలో ఉన్న దేశభక్తిని చాటుకునే ప్రయత్నంలో సురేష్ రెడ్డి వినూత్నంగా ఆలోచించాడు. 25 పైసల నాణేలతో భారీ జాతీయ పతాకాన్ని ప్రత్యేకంగా రూపొందించి ఆకర్షణగా నిలిచాడు. చిత్తూరుకు చెందిన సురేష్ రెడ్డి 2001 నుంచి ఈ ప్రయత్నం ప్రారంభించాడు. 25 పైసల నాణేలను సేకరిస్తూ వచ్చాడు. ఈ ఏడాదితో 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతిలో తాను నివాసం ఉంటున్న ఇంటిపై భాగంలో 25 పైసల నాణ్యాలతో జాతీయ పతాకాన్ని రూపొందించారు. ఈ జాతీయ పతాకం తయారీలో మొత్తం 1,60,000 వరకు 25 పైసల నాణేలు ఉపయోగించారు. దీని బరువు దాదాపు 450 కేజీలు ఉంటుంది.

దాదాపు 45 రోజులపాటు శ్రమించి 25 పైసలు నాణేలతో జాతీయ పతాకం రూపొందించాడు. తిరుపతి వెస్ట్ పిఎస్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ రెడ్డి ప్రకాశం రోడ్డు లోని పోలీస్ క్వార్టర్స్ ఐ బ్లాక్ నంబర్ 67 ఇంటిపై జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశాడు. దాదాపు 12 అడుగుల పొడవు 42 అడుగుల వెడల్పు ఉన్న ఈ జాతీయ పతాకం అందరినీ ఆకట్టుకుంటుంది. వరల్డ్ రికార్డు దిశగా హెడ్ కానిస్టేబుల్ సురేష్ రెడ్డి ఈ ప్రయత్నం చేశారు. ఇప్పటికే గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నం చేసాడు. దేశభక్తి, జాతీయ వాదంపై ఉన్న మక్కువతోనే దేశంలో ఎక్కడా జరగని ప్రయత్నం తాను చేశానని కానిస్టేబుల్ సురేష్ రెడ్డి అంటున్నాడు. ఇందుకోసం 25 పైసలు నాణ్యాలను దేశంలోని పలు ప్రాంతాల నుంచి సేకరించాడు. చెన్నై, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, కలకత్తా లాంటి ప్రాంతాల నుంచి 25 పైసలు నాణేలను సేకరించాడు.

 

ఇవి కూడా చదవండి

చిన్నప్పటి నుంచి తనకు నాణ్యాలు స్టాంపులు సేకరించి అలవాటు ఉందని తిరుపతికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సురేష్ రెడ్డి అన్నాడు. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ తిరుపతిలో సురేష్ రెడ్డి ఏర్పాటు చేసిన జాతీయ పతాకం అందరి చేత ఔరా అనిపించేలా ఆకట్టుకుంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.