Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతులు వీరే.. ఏయే ప్రాంతాల వారు ఉన్నారంటే..

|

Jan 09, 2025 | 8:56 AM

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. ఈ తొక్కిసలాట ఘటనతో రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.. టీటీడీ బైరాగిపట్టెడలో ఎంజీఎం స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. కాగా.. మృతుల వివరాలను అధికారులు ప్రకటించారు.. ఐదుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు.

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతులు వీరే.. ఏయే ప్రాంతాల వారు ఉన్నారంటే..
Tirupati Stampde
Follow us on

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. ఈ తొక్కిసలాట ఘటనతో రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.. టీటీడీ బైరాగిపట్టెడలో ఎంజీఎం స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా.. 48 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన ఆరుగురిలో.. ఐదుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రుయాలో నలుగురు, సీన్స్ లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడ్డ క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి.. రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో 48మంది క్షతగాత్రులు ఉన్నట్లు పేర్కొన్నారు. రుయాలో 34, స్విమ్స్‌లో 14మందికి చికిత్స అందుతోంది..

మృతులు విశాఖకు చెందిన స్వాతి, శాంతి, తమిళనాడుకు చెందిన నిర్మల, మల్లిగ, నరసరావు పేటకు చెందిన బాబు నాయుడు, రజినీగా గుర్తించారు. మృతులకు రుయాలో పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం తర్వాత బంధువులకు డెడ్‌బాడీలను అప్పగించనున్నారు.

సమన్వయ లోపంతో..

కాగా..సంక్రాంతి వేళ వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ పెద్ద ఏర్పాట్లు చేసింది. అయినా టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. బైరాగిపట్టెడలో గంటల కొద్ది వేచి చూసిన భక్తులు గేట్లు తెరవగానే పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో బైరాగిపట్టెడలో టీటీడీ ఎంజీఎం స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఆరుగురు మృతి చెందగా.. 48 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన ఆరుగురిలో.. ఐదుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కొనసాగుతున్న టోకెన్ల జారీ..

మరోవైపు తిరుపతి తిరుమలలో 9 కేంద్రాల్లో 94 కౌంటర్లలో యధావిధిగా టోకెన్ల జారీ కొనసాగుతోంది.. మూడు రోజులకుగాను లక్ష 20 వేల టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది.. నిరంతరాయం గా లక్షా 20 వేల టోకెన్లు పూర్తి అయ్యేంత వరకు జారీ చేయనున్నారు.. ఆ తరువాత రోజుకు 40 వేలు టికెట్లను ఏ రోజు కు ఆ రోజు మాత్రమే టీటీడీ జారీ చేయనుంది. ఆఫ్ లైన్ లో రోజుకు 40 వేల టికెట్లను కౌంటర్ల ద్వారా జారీ చేస్తుంది. రోజుకు 70 వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది.. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్నాయి.

Tirupati Stampede Live Updates: ఆధ్యాత్మిక నగరంలో మృత్యు ఘోష.. లైవ్ అప్డేట్స్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..