ఏపీకి మరో వందేభరత్ రైలు రానుంది. ముఖ్యంగా శ్రీవారి భక్తులకు ఇది తప్పక చదవాల్సిందే. తిరుపతి-పుదుచ్చేరికి వందేభారత్ రైలు నడపనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ ప్రకటించింది. ఇప్పటికే పలు ప్రధాన మార్గాల్లో వందేభారత్ హైస్పీడ్ రైళ్లను మోదీ సర్కార్ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే.
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒక వందేభారత్ రైలు నడుస్తుండగా.. ఇప్పుడు పుదుచ్చేరి నుంచి మరో రైలు తిరుపతికి నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య 340 కి.మీల దూరం ఉంటుంది. ఇక ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పుదుచ్చేరి, చెన్నై, తిరుపతి నగరాలను కలపనుంది. అలాగే ఈ రైలు విల్లుపురం జంక్షన్, మధురతంగం, చెన్నై సెంట్రల్, అరక్కోణం స్టేషన్లలో ఆగనుంది. కాగా, ఈ రైలు సర్వీసును ‘పుదువై వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో ప్రారంభించనుంది కేంద్ర రైల్వేశాఖ. ఫిబ్రవరి 2024 నుంచి ఈ రైలు పరుగులు పెట్టనుంది.
అటు సికింద్రాబాద్ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌కు ఈ వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఈ రెండు నగరాల మధ్య 12 గంటల ప్రయాణం.. ఇకపై ఏడున్నర గంటలకు తగ్గనుందని రైల్వే అధికారులు తెలిపారు. ఆగష్టు 31న ఈ రైలు సర్వీసుకు ముహూర్తం ఖరారు చేసిందట రైల్వే శాఖ. షాద్‌నగర్, మహబూబ్‌నగర్, కర్నూలు, గద్వాల్, ధర్మవరం, డోన్ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో రానుందట. కాగా, సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. అందులో ఒకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం కాగా.. మరొకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతిగా ఉంది. ఈ రెండు సర్వీసులు ప్రయాణీకులతో మంచి రద్దీగా ఉన్నాయి. అందుకే మరిన్ని వందేభారత్ రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టించాలని కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సికింద్రాబాద్ టూ బెంగళూరు, సికింద్రాబాద్ టూ నాగ్‌పూర్, విశాఖపట్నం టూ తిరుపతి, విజయవాడ టూ చెన్నై.. రూట్లలో వందేభారత్ రైళ్లను తిప్పాలని ప్లాన్ చేస్తున్నారు రైల్వే శాఖ అధికారులు.
The Vande Bharat Express in its new colour representing India’s Strength, Valour, Courage and the quest for Knowledge.#NayeBharatKiNayiRail #VandeBharat pic.twitter.com/hcPDibSG5j
— Darshana Jardosh (@DarshanaJardosh) August 21, 2023
Massive makeover of Railway Stations of #AndhraPradesh
Transforming Rly Stns for New Bharat!
👉18 Railway Stations in Andhra Pradesh will be redeveloped
👉Offering improved facades, wide entrance porches and divyangjan-friendly amenities. #AmritBharatStations pic.twitter.com/iNxed847ci
— South Central Railway (@SCRailwayIndia) August 21, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..