Tirupati Kidnap Case: హమ్మయ్య బాలుడు దొరికేశాడు.. అతనే ఎత్తుకెళ్లాడట..

|

Oct 03, 2023 | 11:58 AM

Tirupati, October 03: తిరుపతి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో అపహరణకు గురైన రెండేళ్ల బాలుడి ఆచూకీ లభించింది. ఏర్పేడు మండలం మాధవమాల వద్ద రెండేళ్ల బాలుడిన గుర్తించారు పోలీసులు. అభిలాలకు చెందిన సుధాకర్ అనేక వ్యక్తి ఈ పిల్లాడిని కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. ఆర్టీసీ బస్‌స్టాండ్ నుంచి బాలుడిని ఎత్తుకెళ్లిన సుధాకర్..

Tirupati Kidnap Case: హమ్మయ్య బాలుడు దొరికేశాడు.. అతనే ఎత్తుకెళ్లాడట..
Tirupati Kidnap
Follow us on

Tirupati, October 03: తిరుపతి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తిరుపతి ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో అపహరణకు గురైన రెండేళ్ల బాలుడి ఆచూకీ లభించింది. ఏర్పేడు మండలం మాధవమాల వద్ద రెండేళ్ల బాలుడిన గుర్తించారు పోలీసులు. అభిలాలకు చెందిన సుధాకర్ అనేక వ్యక్తి ఈ పిల్లాడిని కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. ఆర్టీసీ బస్‌స్టాండ్ నుంచి బాలుడిని ఎత్తుకెళ్లిన సుధాకర్.. మాధవమాలలో ఉన్న తన అక్క ఇంట్లో వదిలిపెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక పిల్లాడిని కిడ్నాప్ చేసిన సుధాకర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. తెల్లవారుజామున 2 గంటల నుంచి బాలుడు అదృశ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు పరిసర ప్రాంతమంతా వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్‌స్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతనే బాలుడిని తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా గుర్తించారు పోలీసులు. తమిళనాడుకు చెందిన కుటుంబం తమ కొడుకు అజేన్‌ మునుగన్‌తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే, అర్థరాత్రి 12 గంటలు కావడంతో బస్‌స్టాండ్‌లోనే నిద్రపోయారు. సరిగ్గా 2 గంటల సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు. కాగా, సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. బాలుడిని సుధాకర్ కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. మరికాసేపట్లో పిల్లాడిని బాధిత తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.

గంటల వ్యవధిలోనే పిల్లాడిని ఆచూకీ గుర్తించిన పోలీసులు..

కాగా, తిరుపతిలో కిడ్నాప్‌నకు గురైన పిల్లాడిని పోలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు. మొదట తిరుపతి బస్‌స్టాండ్‌లో గల సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన సుధాకర్‌ను గమనించారు. అతని కదలికల ఆధారంగా తిరుపతి వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లన్నింటికీ సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. గంటల వ్యవధిలోనే పిల్లాడి ఆచూకీని కనిపెట్టగలిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..