Watch Video: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్.. ఎలా ఎత్తుకెళ్లారో చూడండి..!
Tirupati, October 03: ఇటీవలి కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుపతి ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి బాలుడు కనిపించడం లేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు అంతటా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tirupati, October 03: ఇటీవలి కాలంలో చిన్న పిల్లల కిడ్నాప్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుపతి ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో రెండేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచి బాలుడు కనిపించడం లేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు అంతటా గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్‌స్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతనే బాలుడిని తీసుకెళ్తున్నట్లు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా గుర్తించారు పోలీసులు. తమిళనాడుకు చెందిన కుటుంబం తమ కొడుకు అజేన్ మునుగన్‌తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే, అర్థరాత్రి 12 గంటలు కావడంతో బస్‌స్టాండ్‌లోనే నిద్రపోయారు. సరిగ్గా 2 గంటల సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

