మళ్లీ గుబులు రేపుతున్న పెద్దపులి సంచారం.. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో క్షణం క్షణం.. భయం భయం..

గత కొన్ని రోజులుగా ఆంధ్ర, తెలంగాణ బార్డర్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని

  • uppula Raju
  • Publish Date - 2:52 pm, Sat, 26 December 20
మళ్లీ గుబులు రేపుతున్న పెద్దపులి సంచారం.. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో క్షణం క్షణం.. భయం భయం..

గత కొన్ని రోజులుగా ఆంధ్ర, తెలంగాణ బార్డర్‌లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల్ని పులి పొట్టనబెట్టుకుంది. అంతేకాకుండా దీనివల్ల మూగజంతువులు ఎన్నో బలయ్యాయి. తాజాగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పులి సంచారం పలువురిని కలవరపెడుతోంది.

అటవీ ప్రాంతానికి తెలంగాణలోని తిరుమల కుంట, మామిళ్లోరి గూడెం, అసుపాక గ్రామాలు అలాగే ఆంధ్రలోని కుకునూరు ఆనుకొని ఉంది. ఈ సరిహద్దు ప్రాంతంలో పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. పాద ముద్రల కొలతను, వివరాలను సేకరించారు. ఇవే కాకుండా తెలంగాణలోని బూర్గంపాడు, అశ్వాపురం అటవీ ప్రాంతాల్లో అధికారులు పులుల జాడను గుర్తించారు. దీంతో వనాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని జనాలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు సూచించారు. సాధు జంతువులను కూడా చాలా జాగ్రత్తగా పరిరక్షంచుకోవాలని తెలిపారు. దీంతో పులి ఎటువైపు నుంచి ఎవరిపై దాడి చేస్తుందో అని గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటు గడుపుతున్నారు. వెంటనే అటవీ అధికారులు స్పందించి పులి బంధించి తీసుకెళ్లాలని కోరుతున్నారు.