Rare Photo: ఈ ఫొటోలో స్టైల్‌గా వంగి పోజిచ్చిన కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఈయన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. అనతికాలంలోనే సొంతంగా పార్టీని స్థాపించి సంచలన విజయంతో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. యంగ్ సీఎంగా దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఏంటీ.. ఇప్పటికీ ఈ ఫొటోలో ఉన్న బాలుడు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారా.? అయితే మీరు ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఈ ఫొటోలో ఉన్న ఈ చిన్నరి మరెవరో కాదు. ఆంధప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ ఎంతో పాపులర్. ‘మాట తప్పను మడమ తిప్పను’ అంటూ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికారు జగన్. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళతాను అని చెప్పే జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసును చోరగొన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే జగన్ కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సమయం చిక్కినప్పుడల్లా విదేశాలకు వెళ్లే జగన్ అక్కడ సరదాగా గడుపుతుంటారు. జగన్ మోహన్ రెడ్డి విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలు అప్పుడప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి చిన్నతనమంతా హైదరాబాద్‌లోనే సాగిందని అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన అక్కినేని సుమంత్, జగన్‌లు మంచి స్నేహితులు. చదువుకునే రోజుల్లో వీరిద్దరూ చేసిన హంగామా అంతా ఇంత కాదని గతంలో సుమంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక జగన్ మోహన్ రెడ్డి తన విద్యాభ్యాసాన్ని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. అనంతరం నిజాం కాలేజీలో బీకాం చదివారు. ఆ తర్వాత లండన్‌లో ఎంబీఏ చేయడానికి వెళ్లారు. ఇక జగన్ 1996లో భారతిని వివాహం చేసుకున్నారు. జగన్‌కు వర్ష రెడ్డి, హర్ష రెడ్డి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Bandi Sanjay: తెలంగాణకు తీరని ద్రోహం.. టీఆర్ఎస్ సర్కారుపై బండి సంజయ్ లేఖాస్త్రం