గుంటూరులో దారుణం.. గాలిపటం దారం మెడకు చుట్టుకొని!

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గాలిపటం దారం.. ఓ బాలుడి ప్రాణాలు తీసింది. గాలిపటం మాంజా మెడకు చుట్టుకుని మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడిని బైక్‌పై తండ్రి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న బాలుడి మెడకు గాలిపటం మాంజా కోసుకుంది. దీంతో ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వెళ్లే దారిలోనే ఆ బాలుడు ప్రాణాలు వదిలాడు. దీంతో.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లాంచస్టర్‌ రోడ్డులో ఈ ఘటన […]

గుంటూరులో దారుణం.. గాలిపటం దారం మెడకు చుట్టుకొని!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jan 06, 2020 | 5:59 PM

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గాలిపటం దారం.. ఓ బాలుడి ప్రాణాలు తీసింది. గాలిపటం మాంజా మెడకు చుట్టుకుని మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడిని బైక్‌పై తండ్రి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న బాలుడి మెడకు గాలిపటం మాంజా కోసుకుంది. దీంతో ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వెళ్లే దారిలోనే ఆ బాలుడు ప్రాణాలు వదిలాడు. దీంతో.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లాంచస్టర్‌ రోడ్డులో ఈ ఘటన జరిగింది.