Bukkarayasamudram Lake: చెరువులో తేలియాడుతూ కనిపించిన మృతదేహం.. దగ్గరికి వెళ్లి చూడగా ఒక్కరు కాదు..

చెరువులో పైకి తేలాడుతూ వస్తువుల వలే ఏదో కనిపించాయి.. ఏంటోనని అటుగా వెళ్తున్న గ్రామస్థులు దగ్గరకు వెళ్లి చూసి.. ఒక్కసారిగా షాకయ్యారు. చెరువులో మూడు శవాలను చూసి భయంతో పరుగులు తీశారు. ఈ షాకింగ్ ఘటన ఏపీ అనంతపురం జిల్లాలోని..

Bukkarayasamudram Lake: చెరువులో తేలియాడుతూ కనిపించిన మృతదేహం.. దగ్గరికి వెళ్లి చూడగా ఒక్కరు కాదు..
Bukkarayasamudram Lake

Updated on: Mar 30, 2023 | 10:35 AM

చెరువులో పైకి తేలాడుతూ వస్తువుల వలే ఏదో కనిపించాయి.. ఏంటోనని అటుగా వెళ్తున్న గ్రామస్థులు దగ్గరకు వెళ్లి చూసి.. ఒక్కసారిగా షాకయ్యారు. చెరువులో మూడు శవాలను చూసి భయంతో పరుగులు తీశారు. ఈ షాకింగ్ ఘటన ఏపీ అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రంలో చోటుచేసుకుంది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువులో మూడు మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. మూడు శవాలను చెరువులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు అనంతపురానికి చెందిన వారుగా గుర్తించారు. తండ్రి.. ఇద్దరు కొడుకులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతపురం నగరానికి చెందిన మహమ్మద్ రఫీ.. ఆయన భార్య మధ్య కొంత కాలంగా గొడవలు జరగుతున్నాయి. ఈ తరుణంలో ఈ నెల 28న భార్యతో గొడవపడి మహమ్మద్ రఫీ (35), కుమారులు ఇమ్రాన్ (9), సోహైల్ (6) తో కలసి బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆచూకీ దొరకలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో వారు.. త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే గురువారం బుక్కరాయ సముద్రం చెరువులో మృతదేహాలు లభ్యమయ్యాయి.

మహమ్మద్ రఫీ తాపీ పనిచేసుకంటూ జీవనం సాగిస్తున్నాడని.. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే విషయాలను పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇద్దరు చిన్నారులు కావడంతో వారిని చెరువులోకి నెట్టిన తర్వాత రఫి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..