AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 రోజుల్లో రూ. 15 లక్షలు సంపాదన.. అలాంటి పని చేస్తూ రైతుల చేతిలో బంధీ

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని వివిధ గ్రామాల వాసులకు గత ఇరవై రోజుల నుండి కంటి మీద కునుకు లేకుండా పోయింది. జూన్ నెల వచ్చిన వర్షాలు తగినంతగా లేకపోవడంతో రైతులు ఒకవైపు ఆందోళన చెందుతుంటే మరో వైపు తాము పెంచుకుంటున్న గేదెల కనిపించకుండా పోవడంతో ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే రోజుకొక గ్రామంలో గేదెలు కనపించకుండా పోతున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో గేదెలను పొలాల్లోకి వదులుతారు.

20 రోజుల్లో రూ. 15 లక్షలు సంపాదన.. అలాంటి పని చేస్తూ రైతుల చేతిలో బంధీ
Representative Image
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 19, 2024 | 3:45 PM

Share

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని వివిధ గ్రామాల వాసులకు గత ఇరవై రోజుల నుండి కంటి మీద కునుకు లేకుండా పోయింది. జూన్ నెల వచ్చిన వర్షాలు తగినంతగా లేకపోవడంతో రైతులు ఒకవైపు ఆందోళన చెందుతుంటే మరో వైపు తాము పెంచుకుంటున్న గేదెల కనిపించకుండా పోవడంతో ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే రోజుకొక గ్రామంలో గేదెలు కనపించకుండా పోతున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో గేదెలను పొలాల్లోకి వదులుతారు. పంటలు లేకపోవడంతో ఒక ఊరి పొలాల నుండి మరొక ఊరి పొలల వరకూ గేదేలు మేస్తూ రాత్రి సమయానికి ఇంటికి చేరుతుంటాయి. అయితే ఇక్కడ మాత్రం గేదెలు తిరిగి రావడం లేదు.

మేడికొండూరు గ్రామంలోని ఒక రైతుకు చెందిన నాలుగు గేదెలు మొదట కనపించకుండా పోయాయి. వీటి కోసం మండలం మొత్తం గాలించినా కనిపించలేదు. అదే విధంగా పాలడుగు గ్రామంలోని రైతుకు చెందిన నాలుగు గేదెలు కనపించలేదు. ఇదంతా దొంగలే చేస్తున్నారని రైతులకు అర్ధమైంది. అయితే ఈ దొంగల ముఠా అత్యంత తెలివిగా రోజుకొక గ్రామం నుండి బర్రెలను దొంగలించడం పనిగా పెట్టుకున్నారు. ఈ ఇరవై రోజుల్లో రూ.15 లక్షలు విలువైన గేదెలు కనిపంచకుండా పోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం 16 గేదెలను దొంగలించారు. వీరి ఆట ఎలా కట్టించాలో రైతులకు అర్ధం కాలేదు.

తీగలాగితే డొంక కదిలినట్లు.. కొందరు నిర్మానుష ప్రాంతంలో రెండు గేదెలను కట్టేసి ఉంచడాన్ని మేడికొండూరుకు గ్రామానికి చెందిన రైతులు గుర్తించారు. వాటికి కచ్చితంగా దొంగలే అక్కడ కట్టి ఉంటారని భావించారు. వారిని ఎలాగైనా పట్టుకోవాలన్న ఉద్దేశంతో గేదెలను విడపించకుండా అక్కడే మాటు వేశారు. సరిగ్గా రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆటోలో దొంగలు అక్కడకి వచ్చారు. గేదెలను ఆటో ఎక్కించే ప్రయత్నం చేస్తున్న సమయంలో రైతులు ఒక్కసారిగా వారిని పట్టుకున్నారు. ఇద్దరిని బంధించి పోలీసులకు అప్పగించారు. గత ఇరవై రోజులుగా తమ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఆటోల్లో గేదెలు తరలిస్తున్న వారిపై పోలీసులు నిఘా ఉంచాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు