AP News: దర్జాగా కారులో వచ్చి.. మాస్క్ పెట్టుకొని..ఇలా కూడా చేస్తారా.! తీరా చూస్తే..

విశాఖ పెందుర్తి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల మాస్క్‌లు, చేతిలో రాడ్లతో వచ్చి మూడు ఇళ్లలో చోరీ చేసిన కేసు విచారణ చేస్తుండగానే.. తాజాగా మరో ఫ్లాట్‌లో దొంగ దర్జాగా చొరబడి దోచుకుపోయిన ఘటన పోలీసులను పరుగులు పెట్టిస్తోంది.

AP News: దర్జాగా కారులో వచ్చి.. మాస్క్ పెట్టుకొని..ఇలా కూడా చేస్తారా.! తీరా చూస్తే..
Representative Image

Edited By:

Updated on: Feb 29, 2024 | 5:00 PM

విశాఖ పెందుర్తి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల మాస్క్‌లు, చేతిలో రాడ్లతో వచ్చి మూడు ఇళ్లలో చోరీ చేసిన కేసు విచారణ చేస్తుండగానే.. తాజాగా మరో ఫ్లాట్‌లో దొంగ దర్జాగా చొరబడి దోచుకుపోయిన ఘటన పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. అది కూడా దర్జాగా కారులో వచ్చిన దొంగ.. పట్టపగలే పని పూర్తి చేసుకుని మెల్లగా జారుకున్నాడు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని ప్రశాంతి నగర్‌ ఎంకె రాయల్‌లోని ఓ ఫ్లాట్‌లో అరవింద్ అనే పెయింట్ వ్యాపారి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. షాపుకు అరవింద్ వెళ్లిపోవడంతో.. భార్య ఇంటికి తాళం వేసి భర్తకు క్యారేజ్ ఇచ్చేందుకు బయలుదేరింది. ఈ సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడిన 2లక్షల నగదు, తులం పావు బంగారం, 15తులాల వెండి అపహారించుకుపోయాడు. సమాచారం అందుకున్న అరవింద్ ఇంటికి వచ్చి చూశాడు. బీరువాలో భద్రపరిచిన బంగారం, వెండి, నగదు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు అరవింద్. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. క్లూస్ టీం రప్పించి ఆధారాలను సేకరించారు.

కారులో వచ్చి..

దొంగ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మాస్క్ వేసుకుని వచ్చిన వ్యక్తి దర్జాగా బిల్డింగ్‌ పైకెక్కి.. తాళం వేసున్న ఇంటిలో చొరబడి బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. విశేషమేమిటంటే.. దొంగ కారులో వచ్చి పక్కనే పార్కింగ్ చేసి.. ఇంట్లోకి చొరబడి చోరీ చేసి వెళ్లినట్టు ఆధారాలు లభించాయి. పాత నేరస్థుడే అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పెందుర్తి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: మండుటెండల్లో సిమ్లాలాంటి చల్లదనం.. కూలర్ కంటే చౌకైన ధర.. ఈఎంఐ ఆప్షన్ కూడా