Andhra Pradesh: ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చలు విఫలం.. అలా చేస్తేనే ఆందోళన విరమిస్తామన్న ఉద్యోగులు
ఫేస్ పంచ్ (Face Punch) ద్వారా హాజరయ్యే విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు 3...
ఫేస్ పంచ్ (Face Punch) ద్వారా హాజరయ్యే విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు 3 రోజులుగా నిరసన చేస్తున్నారు. ఈ మేరకు వీరితో విద్యాశాఖ కమిషనర్ చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి. దీంతో మంత్రి బొత్స సత్యానారాయణ చర్చల కోసం ఆహ్వానించారు. మంత్రితో జరిగిన చర్చల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలు సొంత ఫోన్లలో ఫేస్ అటెండెన్స్ (Attendence) కు ఒప్పుకునేది లేదని చెప్పారు. తమ స్మార్ట్ ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఏర్పాట్లు పాఠశాలలోనే చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రభుత్వమే మొబైల్ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఫేస్ అటెండెన్స్ యాప్ పై కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని మంత్రి బొత్స చెప్పారు. మంచి లక్ష్యానికి ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.
15 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించి యాప్ అమల్లోకి తెస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే లక్ష మంది ఉపాధ్యాయులు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్నారు. మిగతా 50శాతం మంది త్వరలోనే రిజిస్టర్ చేసుకుంటారు. హాజరు, ఆలస్యం విషయంలో పాత నిబంధనలే ఉంటాయి. మిగతా విభాగాల్లోనూ ఇదే విధానం అమలు కావచ్చు.
– బొత్స సత్యనారాయణ, ఏపీ విద్యాశాఖ మంత్రి
మరిన్ని ఏపీ వార్తలు చదవండి