Andhra Pradesh: ఆ నిందితుడి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు.. తమకే అప్పగించాలని వినతుల వెల్లువ.. ఇంతకీ అతను ఎవరంటే..

|

Dec 03, 2021 | 8:53 AM

అతని కోసం గుంటూరు అర్బన్ పోలీసులకు వినతులు వెల్లువెత్తుతున్నాయి.. తమకంటే తమకు అప్పగించాలని ఏకంగా మూడు రాష్ట్రాల పోలీసులు వేడుకుంటున్నారు. ఇంతకీ అంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా?

Andhra Pradesh:  ఆ నిందితుడి కోసం మూడు రాష్ట్రాల పోలీసులు.. తమకే అప్పగించాలని వినతుల వెల్లువ.. ఇంతకీ అతను ఎవరంటే..
Follow us on

అతని కోసం గుంటూరు అర్బన్ పోలీసులకు వినతులు వెల్లువెత్తుతున్నాయి.. తమకంటే తమకు అప్పగించాలని ఏకంగా మూడు రాష్ట్రాల పోలీసులు వేడుకుంటున్నారు. ఇంతకీ అంత ముఖ్యమైన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా?.. అతని పేరు రాకేష్ పటేల్. అతని కోసం అడుగుతున్నది మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ పోలీసులు. ఏకంగా ఇతర రాష్ట్రాల నుంచి వినతి పత్రాలు అందుతుండటంతో ఏం చేయాలో తెలియక, ఎవరికీ అప్పగించాలో అర్థం కాక గుంటూరు అర్బన్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రాజ్ పురోహిత్ మిర్చి ఎగుమతి వ్యాపారం చేస్తుంటాడు. అతనికి గుజరాత్ కు చెందిన రాకేష్ పటేల్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి విదేశాలకు మిర్చిని ఎగుమతి చేశారు. అయితే రాకేష్ పటేల్…. రాజ్ పురోహిత్ కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. దీంతో గుంటూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రైతులకు సంబంధించిన అంశం కావడంతో గుంటూరు అర్బన్ పోలీసులు రెండు వారాల పాటు గుజరాత్ లో తిష్ట వేసి మరీ రాకేష్ పటేల్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం అతను గుంటూరు జైల్లో నిందితుడిగా ఉన్నాడు. అయితే రాకేష్ పటేల్ దొరికాడని తెలుసుకున్న మూడు రాష్ట్రాల పోలీసులు తమకే అప్పగించాలని అర్బన్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ రాకేష్ పటేల్ పై పలు పెండింగ్ కేసులున్నాయి. అయితే ఎవరికి అప్పగించాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంపై న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ వెల్లడించారు.

నాగరాజు, గుంటూరు, టీవీ9

Also Read:

Telangana: కొమురం భీం జిల్లాలో విద్యుత్‌ కంచెలు తగిలి మహిళ మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..

Vijayawada: బెజవాడ నగరంలో కొత్త అలజడి.. భయంతో వణికిపోతున్న ప్రజలు.. కారణమేంటంటే..!

Cyber Crime: ఎస్‌బీఐ ఫేక్ కాల్‌ సెంటర్‌తో ఫ్రాడ్‌.. వివరాలు చెప్పారో సమర్పయామి అనాల్సిందే..!