నడిసంద్రంలో రణరంగం.! ఆంధ్ర జలాల్లోకొచ్చి అరవోళ్ల దాడి.. గంగపుత్రుల కడుపుకొడుతున్న తమిళ జాలర్లు
అందరికీ తెలిసిందే.. ఏటా 61 రోజుల పాటు చేపల వేట నిషేధం ఉంటుంది. ఆ తరువాత రోజు నుంచి ఒక్కో జిల్లా నుంచి సుమారు వెయ్యి బోట్లు సముద్రంలోకి వెళ్తాయి. అలా ఎంత మంది వెళ్లినా.. టన్నుల కొద్దీ మత్స్యసంపదను ఇస్తుంది సముద్రం. కాని, దారుణం ఏంటంటే.. వేల బోట్లు వేసుకుని వెళ్లినా ఆంధ్రా మత్స్యకారులకు పడేదేమో కేజీలకొద్దీ చేపలు.

అందరికీ తెలిసిందే.. ఏటా 61 రోజుల పాటు చేపల వేట నిషేధం ఉంటుంది. ఆ తరువాత రోజు నుంచి ఒక్కో జిల్లా నుంచి సుమారు వెయ్యి బోట్లు సముద్రంలోకి వెళ్తాయి. అలా ఎంత మంది వెళ్లినా.. టన్నుల కొద్దీ మత్స్యసంపదను ఇస్తుంది సముద్రం. కాని, దారుణం ఏంటంటే.. వేల బోట్లు వేసుకుని వెళ్లినా ఆంధ్రా మత్స్యకారులకు పడేదేమో కేజీలకొద్దీ చేపలు. అదే తమిళనాడు జాలర్లు వేసిన వలలకేమో టన్నుల కొద్దీ చేపలు. అది కూడా ఆంధ్రా తీర ప్రాంతంలోకి వచ్చి మరీ దర్జాగా పట్టుకుపోతుంటారు తంబీలు. వాళ్లకేమో 10, 20 టన్నుల చేపలు.. మనోళ్లకేమో కేజీల లెక్కన చేపలా? ఎందుకీ పరిస్థితి? ‘తీరంలో కెరటాలు ఎరుపెక్కుతాయ్’ అనే డైలాగ్ విన్నప్పుడు ఏమో అనుకున్నాం గానీ.. నడిసంద్రంలో ఆంధ్రా-అరవ జాలర్లు ఎదురుపడ్డప్పుడు నిజంగా అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. సినిమాల్లో చూపించినట్టు సముద్రంలో ఛేజింగ్‌లు జరుగుతాయ్. అప్పుడప్పుడు ఫైటింగులు కూడా. ఈ రగడ ఇప్పటిది కాదు పదేళ్లకు పైగా నడుస్తోందీ వైరం. తమిళనాడు మత్స్యకారుల్లో కడలూరు జాలర్లు వేరు. అమ్మో.. వీరి దౌర్జన్యం అచ్చంగా మాస్ సినిమాను చూసినట్టే ఉంటుంది. వేటకత్తి తీసి నరికేస్తాం అన్నట్టుగా బోటుపై వేటు వేస్తూ ఉంటాడొకడు. రాళ్లు సిద్ధం చేస్తుంటాడు మరొకడు. మొనదేలిన గాజు పెంకులను బయటకు తీస్తుంటారు. ఇదంతా.. ‘మా సముద్రజలాల సరిహద్దుల్లోకి మీరెందుకు వచ్చారు’ అని ఆంధ్రా జాలర్లు అడుగుతున్నప్పుడే జరుగుతుంటుంది. కొన్నిసార్లు తమిళుల బోట్లు, అందులోని మనుషులను చూసి.....




