Andhra News: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. నెల్లూరులో పారిశ్రామిక వాడకు “భారత్ సిందూర్‌” గా నామకరణం!

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్క్‌కు భారత్ సిందూర్ ఎంఎస్ఎంఈ పార్క్‌గా నామకరణం చేసింది. సీఎం చంద్రబాబు సూచన మేరకు భారత్ సిందూర్‌గా నామకరణం చేసినట్టు ఈ పార్క్‌కు శంకుస్తాపన చేసిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

Andhra News: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. నెల్లూరులో పారిశ్రామిక వాడకు భారత్ సిందూర్‌ గా నామకరణం!
Nellore

Edited By:

Updated on: May 10, 2025 | 3:58 PM

శనివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం అమంచర్లలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్తాప చేశారు. ఈ పార్కుకు భారత్ సిందూర్ ఎంఎస్ఎంఈ పార్క్‌గా నామకరణం చేశారు. సీఎం చంద్రబాబు సూచన మేరకే ఈ పేరు పెట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడులకు భారత్‌లో బయపడేవాళ్లు ఎవరూ లేరని.. పాక్ దాడులను భారత్‌ సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. భారత మహిళల సిందూరాన్ని చేరిపేయడానికి ప్రయత్నించిన పాకిస్తాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో భారత్‌ బుద్ది చెప్పిందన్నారు.

భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను యావత్‌ ప్రపంచం నిశితంగా పరిశీలిస్తోందని.ధర్మ పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మోరల్ సపోర్ట్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

మరోవైపు రాష్ట్రంలో 60 ఎకరాల్లో ఈ MSME పార్కు పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. భవిష్యత్‌లో దీన్ని మరింత విస్తరిస్తామని ఆయన తెలిపారు. ఈ పార్కు ఏర్పాటుతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పదివేల మందికిపైగా ఉపాధి అవకాశం లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ ఎంఎస్ఎంఈ పార్క్‌గా నామకరణం చేసినట్టు ఆయన తెలిపారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న వారికి 48 గంటల్లోనే అన్ని అనుమతులు వస్తాయని ఆయన అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..