Weather: ఏపీ వాసులకు కూల్ న్యూస్‌.. మూడు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

భారత వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అకవాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. అల్పపీడన ద్రోణి/గాలులు కోత ఇప్పుడు పశ్చిమ విదర్భ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి మరాట్వాడా మీదుగా...

Weather: ఏపీ వాసులకు కూల్ న్యూస్‌.. మూడు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
కొన్ని చోట్ల చెట్లు కూలిపోయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునడంతో రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నాలాల వెంబడి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. ఎక్కడ గుంతలు ఉన్నాయో, మ్యాన్‌ హోల్స్‌ ఉన్నాయో తెలియక జనం ఆందోళనకు లోనయ్యారు. అత్యధికంగా శేరిలింగంపల్లి ఖాజాగూడలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత షేక్‌పేటలో 5.2 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 4.6 సెంటీమీటర్లు, మాదాపూర్‌లో 4.5 సెంటీమీటర్లు, సింగిరేణికాలనీలో 4.1 సెంటీమీటర్లు, అమీర్‌పేటలో 4.0 సెంటీమీటర్లు, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Apr 25, 2023 | 3:50 PM

భారత వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అకవాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. అల్పపీడన ద్రోణి/గాలులు కోత ఇప్పుడు పశ్చిమ విదర్భ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి మరాట్వాడా మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి , సగటు సముద్ర మట్టానికి 1 . 5 కి.మీ ఎత్తులో కోనసాగుతున్నది. దీంతో ఆంధ్రప్రదేశ్, యానంలలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ / నైరుతి గాలులు వీస్తున్నాయి.

ఉత్తర కోస్తాతో పాటు యానాంలో మంగళవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మంగళవారం తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

రాయలసీమ ప్రాంతం విషయానికొస్తే.. మంగళ, బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. బలమైన గాలులు (గంటకు 30 -40 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..