Andhra Pradesh: చల్లా కుటంబంలో ఆగని మంటలు.. చిచ్చు రేపుతోన్న ఆస్తి, రాజకీయ వివాదాలు.

చల్లా ఫ్యామిలీలో రేగిన మంటలు చల్లారేలా లేవ్‌. ఆస్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజకీయ వారతస్వం వరకు దివగంత నేత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో చిచ్చు రేగుతోంది. కుటుంబసభ్యులే పరస్పరం దాడులు చేసుకున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథరెడ్డి భార్య అయిన అవుకు..

Andhra Pradesh: చల్లా కుటంబంలో ఆగని మంటలు.. చిచ్చు రేపుతోన్న ఆస్తి, రాజకీయ వివాదాలు.
Challa Family

Updated on: Apr 01, 2023 | 4:06 PM

చల్లా ఫ్యామిలీలో రేగిన మంటలు చల్లారేలా లేవ్‌. ఆస్తుల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజకీయ వారతస్వం వరకు దివగంత నేత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో చిచ్చు రేగుతోంది. కుటుంబసభ్యులే పరస్పరం దాడులు చేసుకున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథరెడ్డి భార్య అయిన అవుకు జడ్పీటీసీగా ఉన్న చల్లా శ్రీలక్ష్మిపై.. చల్లా కుటుంబ సభ్యులు దాడి చేయడం కలకలం రేగింది. చల్లా రామకృష్ణారెడ్డి భార్య శ్రీదేవి సహా ఇతర ఫ్యామిలీ మెంబర్స్ దాడిలో పాల్గొనడంతో మరోసారి ఈ కుటుంబంపై అందరి ఫోకస్ పడింది.

చల్లా కుటుంబానికి బలమైన రాజకీయ బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది. రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఉంటూ చనిపోవడంతో.. ఆయన చిన్న కుమారుడు భగీరథరెడ్డిని ఎమ్మెల్సీని చేసింది వైసీపీ అధిష్ఠానం. భగీరథరెడ్డి కూడా పదవిలో ఉండగానే చనిపోవడంతో.. రాజకీయ వారసత్వం నుంచి కుటుంబ ఆస్తుల వరకు సమస్యలు తలెత్తాయి. అవుకు జడ్పీటీసీగా ఉన్న భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మినే రాజకీయ వారసురాలిగా నిలదొక్కుకోవాలని చూస్తున్నారు. ఈ అంశంలో చల్లా కుటుంబం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. చల్లా రామకృష్ణారెడ్డి పెద్దకొడుకు విఘ్నేశ్వర్‌రెడ్డి.. పొలిటికల్‌ వారసుడిగా ఉండాలనే డిమాండ్‌ కుటుంబ సభ్యుల నుంచి వినిపిస్తోంది. ఈ విషయంలో గొడవలు ముదిరి పలుమార్లు రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయి. పరస్పరం సవాళ్లు విసురుకున్నాయి. ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆమధ్య సీఎం జగన్‌ జోక్యంతో రెండు వర్గాల మధ్య రాజీకి వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు ఆఫీసులోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వరకు వెళ్లడంతో.. రాజకీయ వారసత్వం రగడ రచ్చ రచ్చ లేపుతోంది.

ఒక్క రాజకీయమే కాదు.. ఆస్తుల విషయంలోనూ చల్లా కుటుంబ సభ్యుల మధ్య పీటముడి పడుతోంది. రెండు పక్షాలు పట్టువిడుపులకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం లేదు. లెక్కలు తేలాల్సిందే అన్నది రెండు వర్గాల వాదన. చల్లా ఆస్తుల్లో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని విఘ్నేశ్వర్‌రెడ్డి చెబుతుంటే.. చల్లా రామకృష్ణారెడ్డి కొడలిగా.. చల్లా భగీరథరెడ్డి భార్యగా తాను తగ్గేదే లేదంటున్నారు శ్రీలక్ష్మి.

ఇవి కూడా చదవండి

చల్లా ఫ్యామిలీలో రెండు వర్గాలదీ రాజకీయంగా భిన్నమైనదారులు కాదు. చల్లా కుటుంబ సభ్యులు వర్గాలుగా విడిపోయినా.. అధికారపార్టీ వైసీపీకి లాయలే. పార్టీ కోసమే పనిచేస్తామని చల్లా విఘ్నేశ్వర్‌రెడ్డి చెబుతుంటే.. సీఎం జగన్‌ ఏం చెబితే అదే చేస్తానంటున్నారు శ్రీలక్ష్మి. రాజకీయంగా తమ గమ్యం.. ఆలోచనలు ఒకటే అయినప్పటికీ.. వీళ్లంతా గొడవలు పక్కనపెట్టి కలిసి సాగుతారా అనేది ప్రశ్నే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..