AP Politics: రంగనాథ స్వామి రథోత్సవంలో రచ్చ.. ఎమ్మెల్యే ఉన్నాడంటూ జేసీని అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం..

తాడిపత్రి నియోజకవర్గంలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో తాడేపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హల్చల్ చేశారు. అటు ప్రభుత్వం తీరుపై జేసీ సోదరులు కీలక కామెంట్స్ చేశారు. ఆలూరు రంగనాథ స్వామి రథోత్సవంలో హై టెన్షన్ పరిస్థితి నెలకొంది. రథోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని..

AP Politics: రంగనాథ స్వామి రథోత్సవంలో రచ్చ.. ఎమ్మెల్యే ఉన్నాడంటూ జేసీని అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం..
Jc Prabhaker Reddy

Updated on: Apr 07, 2023 | 9:59 AM

తాడిపత్రి నియోజకవర్గంలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హల్చల్ చేశారు. అటు ప్రభుత్వం తీరుపై జేసీ సోదరులు కీలక కామెంట్స్ చేశారు. ఆలూరు రంగనాథ స్వామి రథోత్సవంలో హై టెన్షన్ పరిస్థితి నెలకొంది. రథోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ. సుమారు రెండు గంటలకు పైగా జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు జెసికి పోలీసులకు మధ్య మాటలు, వాగ్వాదం చోటు చేసుకుంది.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆలూరు బ్రహ్మోత్సవాలకు హాజరై ఎద్దుల పోటీలను ప్రారంభించి, రథోత్సవంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రధోత్సవంలో పాల్గొనడంతో.. ఇటు ఉత్సవాల్లో పాల్గొనడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తుండడంతో లా అండ్ ఆర్డర్ దృష్ట్యా జేసీని ముందస్తుగా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే ఉత్సవాల్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉన్నారని.. ఇద్దరూ ఒకేసారి రథోత్సవానికి హాజరైతే గ్రామంలో గొడవలు జరుగుతాయంటూ సూచించారు. వినకపోవడంతో 41 నోటీసులు ఇచ్చి జేసీ దివాకర్ రెడ్డిని ఇంటిలోకి పంపించారు పోలీసులు. ఈ ప్రభుత్వంలో గుడికి బడికి పోవాలంటే కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ.

ప్రజా కార్యక్రమాలకు వెళ్లకుండా జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి. ఈ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత లోకేష్ పాదయాత్రలో స్పష్టంగా కనిపిస్తుందనన్నారు. అటు టార్గెట్ 175 పై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ జేసీ.

ఇవి కూడా చదవండి

ఎమ్మెల్యే కేతిరెడ్డి కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఎట్టకేలకు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆలూరు బ్రహ్మోత్సవాలకు పోలీసులు అనుమతించారు. స్వామివారిని దర్శించుకున్న జేసి ప్రభాకర్ రెడ్డి డప్పుల మధ్య డ్యాన్స్ వేసి తన అనుచరులను కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..