Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోడిగుడ్ల లారీలను బోర్డర్‌లోనే ఆపేశారు

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!
Eggs

Updated on: Apr 27, 2022 | 5:08 PM

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోడిగుడ్ల లారీలను బోర్డర్‌లోనే ఆపేశారు ఒడిశా పౌల్ట్రీ రైతులు. ఖుర్దారోడ్ వద్ద జాతీయ రహదారిపై ఒడిస్సా లేయర్ కోళ్ల రైతులు, ట్రేడర్స్ ఏపీ గుడ్లను అడ్డగించారు. దాంతో ప్రస్తుతం బరంపూర్ దగ్గరే ఏపీకి చెందిన 200 లారీలు ఆగిపోయాయి. ఏపీ గుడ్లు వస్తే తమ దగ్గర ఇంకా ధర పడిపోతుందని అడ్డుకుంటున్నారు ఒడిస్సాకు చెందిన రైతులు, ట్రేడర్స్. అయితే, గుడ్ల లారీలను అడ్డుకోవడంపై ఏపీ ఎగ్ ట్రేడర్స్, ఒడిస్సా ఎగ్ ట్రేడర్స్ మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. దాంతో.. నిన్న ఉదయం నుంచి 200 కోడిగుడ్ల లారీలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. గుడ్ల ఉత్పత్తి పెరగడం, వినియోగం తగ్గడంతో దేశ వ్యాప్తంగా ధర పడిపోయింది. మన దగ్గర ఉత్పత్తి పెరగడంతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అయితే ఒడిశా రైతులు మాత్రం లారీలను అడ్డుకుంటున్నారు. అయితే, పరిస్థితి కారణంగా ఎండ వేడికి గుడ్లు పాడవుతాయనే ఆందోళనలో ఉన్నారు ఆంధ్రా రైతులు. 36 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లుతుందని ఆంధ్రా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Letter to PM Modi: విద్వేషపూరిత రాజకీయాలు ఆపండి.. మీ మౌనం మంచిది కాదు.. ప్రధాని మోదీకి మాజీ ఉన్నతాధికారుల లేఖ

Tirumala: చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.. తిరుమలలో భక్తుల కష్టాలపై పరిపూర్ణానంద సీరియస్..

KTR in Plenary: బీజేపీ చేతిలో అధికారం – భారతావనికి అంధకారం.. కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరంః కేటీఆర్