AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు పెళ్లిళ్లు చేసుకొని వాళ్లను వదిలేశాడు.. ఇప్పుడు అత్త కూతురిపై కన్నేశాడు! ఆమె కాదనడంతో..

గుడికల్ గ్రామంలో నివసించే నరసమ్మ అనే యువతిని చిన్న నల్లన్న అనే వ్యక్తి 11 సంవత్సరాలుగా ప్రేమించాలని వేధిస్తున్నాడు. నరసమ్మ తిరస్కరించడంతో, నల్లన్న తన బంధువులతో కలిసి ఆమె ఇంటిపై దాడి చేశాడు. నరసమ్మ, ఆమె తండ్రి, అక్కకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు పెళ్లిళ్లు చేసుకొని వాళ్లను వదిలేశాడు.. ఇప్పుడు అత్త కూతురిపై కన్నేశాడు! ఆమె కాదనడంతో..
Nallanna
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 17, 2025 | 5:24 PM

Share

తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఓ ప్రబుద్ధుడు 11 సంవత్సరాలుగా వెంటపడుతూ వేధిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి నిరకరించడంతో ఆమె కుటుంబంపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా గుడికల్ గ్రామంలో నివాసం ఉంటున్నా దావీదు, గిడమ్మా లకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ వీరు జీవనం సాగిస్తూ తన పిల్లలందరికి వివాహం చేయగా చివరి ఆడపిల్ల అయినా నరసమ్మ అనే యువతి చదువుకుంటుంది. అదే గ్రామంలో నివాసం ఉంటున్న ఇరమ్మ, ఇజ్రాయెల్ కుమారుడు చిన్న నల్లన్న అనే వ్యక్తి చదువుకుంటూ ఉండగా వరుసకు మేనత్త కూతురు అయినా నరసమ్మను 11 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.

ఆ వేధింపులు తట్టుకోలేక 2019లో రూరల్ పోలీస్ స్టేషన్ లో యువతి కేసు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే నల్లన్నకు ఇది వరకే రెండు పెళ్లిళ్లు జరిగి విడాకులు కూడా తీసుకున్నాడు. అయినా కూడా ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు. నరసమ్మ తనను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ నిత్యం వేధిస్తున్నాడు. వరుసకు నరసమ్మ మేనత్త కూతురు కావడంతో కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని నల్లన్న ముర్ఖంగా పట్టుపట్టాడు. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం యువతికి ఓ సంబంధం చూస్తే.. వారికి ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, నేనే చేసుకుంటాను అని చెప్పడంతో వచ్చిన పెళ్లి సంబంధం రద్దు అయింది.

విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లితండ్రులు నల్లన్న ఇంటికి వెళ్లి మందలించడంతో ఈ రోజు ఉదయం నల్లన్న తన బంధువులతో కలిసి యువతి నరసమ్మ ఇంటి పై ఒక్కసారిగా కట్టెలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి తో పాటు అక్క శాంతి, తండ్రి దావిద్ కు తీవ్రగాయలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఘటనపై ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని, ఇప్పటికైనా నల్లన్న నుండి తనకు రక్షణ కల్పించాలని యువత నరసమ్మ వేడుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి