AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కానిస్టేబుల్ కాదు.. కాటేసే నాగు.. వారు ఏకాంతంగా కనిపిస్తే చాలు పేట్రేగిపోతాడు.. చివరకు

ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారి పరువును పణంగా పెట్టి వారి వద్ద నుంచి డబ్బులు గుంజేస్తున్నాడు ఆ కీచక కానిస్టేబుల్.. తన బంధువుని కానిస్టేబుల్ గా పాలకొండ ప్రాంతంలో తిప్పుతూ అక్కడకు వస్తున్న ప్రేమ జంటలను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతున్నారు ఇదంతా ఓ విద్యార్థిని ఆత్మహత్యతో బట్టబయలు అయింది.. తన మరణానికి కారణాలు వెతుకుతుండగా ఈ కీచుకుల పర్వం బయటపడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా రేపింది.

Andhra: కానిస్టేబుల్ కాదు.. కాటేసే నాగు.. వారు ఏకాంతంగా కనిపిస్తే చాలు పేట్రేగిపోతాడు.. చివరకు
Crime News
Sudhir Chappidi
| Edited By: Shaik Madar Saheb|

Updated on: May 17, 2025 | 5:47 PM

Share

కడప జిల్లాలో అతడో ఏఆర్ కానిస్టేబుల్.. అయితే అతనికి ఎక్కడైనా ప్రేమజంట కనిపిస్తే ఫొటోలు తీసి భయపెట్టి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇటీవల అతడి వేధింపులు తాళలేక రాజంపేటలో ఓ బీటెక్ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌గా చెప్పుకుని తిరిగే అనీల్ కుమార్‌రె డ్డిని అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి అరెస్ట్ తో ఏఆర్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డి బాగోతం బయటపడింది. అనంతరం కడప జిల్లా ఎస్పి అతడిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కడప ఏ ఆర్ విభాగంలో కె. రామ్మోహన్ రెడ్డి (ఏఆర్పీసీ 328) కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. తన బంధువైన ప్రొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డిని పాలకొండల్లో అనధికారికంగా నియమించుకున్నాడు. అక్కడకు వచ్చే ఒంటరి మహిళలు, ప్రేమజంటలను టార్గెట్ చేస్తూ అనిల్ ఫొటోలు తీసి, వారి ఫోన్ నంబర్ అడిగి ఆ వివరాలు రామ్మోహన్ రెడ్డికి పంపేవాడని తెలుస్తోంది. వెంటనే కానిస్టేబుల్ పాలకొండలకు వచ్చి ఫోటోలు చూపి బయపెట్టడంతో పాటు తల్లిదండ్రులకు చెబుతానని భయపెట్టి, అందినకాడికి దోచుకునేవాడని పోలీసులు నిగ్గు తేల్చారు.

అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 3 వ తేదీన తోటి స్నేహితులతో కలిసి పాలకొండలకు వెళ్లారు. వెంటనే అనిల్ వారి ఫొటోలు తీయగా, రామ్మోహన్ రెడ్డి వెళ్లి భయపెట్టాడు. దీంతో వారు 4 వేలు ఇచ్చి బయటపడ్డారు. తర్వాత మళ్లీ వేధించడంతో మరో పదివేలు ఇచ్చుకున్నారు. అయినా ఆశ తీరని కానిస్టేబుల్ ఇంకా డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఫిబ్రవరి 5 వ తేదీన ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు కేసును ఛేధించిన విధానం చూస్తే.. రాజంపేట పట్టణం బోయినపల్లిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న వన్నూరు అఖిల ఫిబ్రవరి 5న బలవన్మరణానికి పాల్పడింది. తాను ఉంటున్న లేడీస్ హాస్టల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురం జిల్లా, పెద్దపప్పూరు మండలం, C.చిక్కేపల్లి గ్రామానికి చెందిన వన్నూరు అఖిల మరణం మిస్టరీగా మారింది. కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న అఖిల ఎందుకు ఉరి వేసుకుని చనిపోయిందన్న విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసు విచారణలో విస్తుబోయే విషయాలు బహిర్గతమయ్యాయి. అఖిల మిస్టరీని ఛేదించిన పోలీసులు మృతికి గల కారణాలను వివరించారు.

అఖిల తన స్నేహితులతో కలిసి కడప సమీపంలోని పాలకొండ జలపాతాల వద్దకు వెళ్ళింది. అక్కడ కళాశాల మానేసి విహారయాత్రలు చేస్తున్నారా అంటూ పల్లపోతుల అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అఖిలను బెదిరించడం జరిగింది. తాను పోలీసునంటూ డైరీలో అఖిల, అఖిల తల్లిదండ్రుల పేర్లు ఫోన్ నెంబర్లు అనిల్ కుమార్ రెడ్డి రాసుకున్నారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఏకాంతంగా గడిపిన విషయాన్ని, కళాశాల ఎగగొట్టి విహార యాత్రలు చేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తానంటూ బెదిరించాడు.. భయపడ్డ అఖిల తన వద్ద ఉన్న నాలుగు వేల రూపాయలను అనిల్ కుమార్ రెడ్డికి ఇచ్చేసింది. తను తరచూ డబ్బులు ఇవ్వాలని వేధిస్తూ ఉండడంతో తన వద్ద డబ్బులు లేవని అఖిల చెప్పడం జరిగింది. దీంతో అనిల్ కుమార్ రెడ్డి అఖిల తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ కూతురు ఇలా కళాశాలకు వెళ్లకుండా తిరుగుతుందంటూ తెలపడం జరిగింది. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని ఉరి వేసుకుని తనువు చాలించినట్టు పోలీసులు తెలిపారు. ఇంతవరకు అనిల్ కుమార్ అరెస్ట్ అయిన బాగోతం.

ఇది అనిల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత పోలీసుల విచారణలో అతను చెప్పిన కొత్త విషయాలు బయటపడ్డాయి.. దీంతో ఇక్కడే మరో కొత్త ట్విస్ట్ మొదలైంది. అరెస్ట్ అయిన అనిల్ కుమార్ కొత్త నిజాలను బయటపెట్టాడు.. అసలు పాత్రధారి సూత్రధారి తాను కాదని నన్ను నడిపించేదంతా ఏఆర్ కానిస్టేబుల్ గా ఉన్న రామ్మోహన్ రెడ్డి అని పోలీసుల విచారణలో తేలడంతో రామ్మోహన్ రెడ్డిని కూడా పోలీసులు విచారించారు. దీంతో అసలు నిజాలు బయటపడ్డాయి. కానిస్టేబుల్ గా ఉన్న తన బంధువైన అనిల్ కుమార్ రెడ్డిని కానిస్టేబుల్ గా కొనసాగిస్తూ అతనితో జంటల ఫోటోలను తీయిస్తూ వారిని బెదిరించేవాడని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఇద్దరు పంచుకునేవారు అనే విషయం బయటపడింది. దీంతో కడప జిల్లా ఎస్పీ ఆర్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.

పోలీసు విచారణలో విస్తు పోయే విషయాలు బయటపడ్డాయి. నిందితుడు అనిల్ కుమార్ రెడ్డి కడప టౌన్ పాలకొండలు, ఔటర్ రింగ్ రోడ్డు, పులివెందుల టాన్ ఔటర్ రింగ్ రోడ్, కదిరి రోడ్డులోని బట్రేపల్లి మార్గాలలో ప్రేమ జంటలను, మద్యం త్రాగే వాళ్ళను టార్గెట్ గా చేసుకొని తాను పోలీస్ డిపార్టుమెంటుకి చెందిన వ్యక్తినని, వారి పేర్లను తన వద్ద ఉండే డైరీలో వ్రాసుకొని.. వారి విషయలను పై అధికారులకు చెప్పి కేసు నమోదు అయ్యేలా చేస్తానని బెదిరిస్తున్నట్లు వెళ్లడైంది. వారి వద్ద అందిన కాడికి డబ్బులు ఇవ్వాలని బెదిరించి, వారి వద్ద నుండి డబ్బులు లాక్కొని పంపిస్తూ ఉండే నేర ప్రవృతిని కలిగి ఉన్నట్లు తేలింది.. గతంలో కూడా నిందితుడు అనీల్ కుమార్ రెడ్డి పై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. గుత్తి పోలీస్ స్టేషన్ లో POCSO కేసు, అనంతపురం III town PS లో దొంగతనం కేసు, ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో రేప్ అటెంప్ట్ కేసులు నమోదు అయి, ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ కేసులో నాన్ బేయిలబుల్ వారెంట్ కూడా పెండింగ్ ఉన్నది. కనుక విద్యార్థులు ఏకాంతానికి వెళ్లే జంటలు అప్రమత్తంగా ఉండాలని పర్యావరణాన్ని ఆస్వాదించాలన్న ఆశతో పట్టణాలకు దూరంగా వెళ్లే ప్రాంతాల్లో జరిగే మోసాలను తెలుసుకోవాలని ఇలాంటివి ఎవరికైనా ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రాజంపేట ఏఎస్పి రామ్నాథ్ హెగ్డే సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..