Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, ఆదివారం నాడు పలువురు సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సినీ నటులు రాజేంద్రప్రసాద్, మంచు విష్ణు వేరు వేరుగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకోలేక పోయానని చెప్పిన ఆయన.. ఆలస్యంగానైనా స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు. అదృష్టావశాత్తు సుందరకాండ పారాయణం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగిందని, చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు నాలుగు సార్లు సుందరకాండ పారాయణంలో పాల్గొన్నానని, అది తన అదృష్టంగా భావిస్తున్నానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
తిరుమలలో సుందరకాండ పారాయణం నిర్వహించిన 60 రోజులకి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభించడం జరిగడం.. సుందరకాండ పారాయణం కొనసాగుతుండగానే ఆంజనేయస్వామి జన్మస్ధలం అంజనాద్రే అని టిటిడి కమీటీ నిర్ధారించడం ఎంతో సంతోషాన్ని కలుగజేసిందని పేర్కొన్నారు రాజేంద్ర ప్రసాద్. కాగా, కరోనా మహమ్మారి అంతం కావాలని, త్వరలో థీయేటర్లు ప్రారంభమై అందరూ సినిమాలు వీక్షించే అవకాశం కలిగించాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Also read:
మొదట తాలిబన్ల జోరుకు అడ్డుకట్ట వేయండి…ఆఫ్ఘన్ దళాలకు అమెరికా హితవు.. కాబూల్ కు మరింత సాయం
Bunny Vasu: నిర్మాత బన్నీ వాసు ఆవేదన.. ఏకంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు లేఖ
జమ్మూలో డ్రోన్ దాడులు..పాకిస్తాన్ కు భారత్ తీవ్ర నిరసన.. శాంతి, సుస్ధిరతలే ప్రధాన అజెండా