AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆయన రాజీనామా చేయాల్సిందే.. లేదంటే మీరే తొలగించండి.. సీఎం జగన్‌కు సోమువీర్రాజు డిమాండ్..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత పార్టీ..

Andhra Pradesh: ఆయన రాజీనామా చేయాల్సిందే.. లేదంటే మీరే తొలగించండి.. సీఎం జగన్‌కు సోమువీర్రాజు డిమాండ్..
Somu Veerraju
Shiva Prajapati
|

Updated on: Jul 25, 2021 | 12:15 PM

Share

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో హిందూమతాన్ని కించపరిచే విధంగా మాట్లాడిస్తున్నారన్నారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే మాట్లాడటం దారుణం అన్నారు. 2వ రోజు దేవాలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా సోమువీర్రాజు ఆదివారం నాడు వినుకొండలో ప్యటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. గోవధ చట్టాన్ని రద్దు చేయాలని ఎమ్మెల్యే అంటున్నారని, గోమాంసం తినడాన్ని ప్రోత్సహిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి భారతీయులను కింపరుస్తారా? అని వీర్రాజు ఫైర్ అయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేశాల మాట్లాడిన ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే.. ముఖ్యమంత్రే ఆయనను సస్పెండ్ చేయాలన్నారు.

తరచుగా హిందువులను కించపరిచే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని సోము వీర్రాజు పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లపై ముఖ్యమంత్రి వెంటనే సమాధానం చెప్పాలని వీర్రాజు డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో దేవాలయాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలన్నారు. జెరూసలెం, మక్కా వెళ్లే వారికి నిధులు ఇచ్చినట్లే.. తిరుపతికి వెళ్లడానికి హిందువలకు కూడా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఆలయాల అభివృద్ధి కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాలుగు రోజుల పాటు దేవాలయాలు దర్శిస్తున్నారు.

Also read:

Tokyo Olympics 2021: రాయిటర్స్‌పై చైనా ఆగ్రహం.. మహిళా అథ్లెట్ ఫొటో అభ్యంతరకరంగా చూపిస్తారా అంటూ..!

రెండు డోసులతోనే డెల్టా కు చెక్..!రానున్న మరో ప్రమాదకరమైన మూడు వేరియంట్లు..:Control Delta with two doses Video.

Godavari Floods: కోనసీమను ముంచెత్తుతున్న గోదావరి.. ఒక్కసారిగా ముందుకెళ్లిన పడవ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..