Badvel by election: బద్వేల్ ఉప ఎన్నికపై టీడీపీ సంచలన నిర్ణయం.. పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చిన అధిష్టానం..

|

Oct 03, 2021 | 6:50 PM

Badvel by election: బద్వేల్ ఉప ఎన్నికపై టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికలో పోటీ చేయబోమని తేల్చి చెప్పింది.

Badvel by election: బద్వేల్ ఉప ఎన్నికపై టీడీపీ సంచలన నిర్ణయం.. పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చిన అధిష్టానం..
Tdp
Follow us on

Badvel by election బద్వేల్ ఉప ఎన్నికపై టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికలో పోటీ చేయబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు టీడీపీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నాడు తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బద్వేల్ ఉప ఎన్నిక, ఏపీలో రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై సుధీర్ఘంగా చర్చించారు. అయితే, తొలుత బద్వేల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దించాలని భావించిన టీడీపీ.. ఆ తరువాత వెనక్కి తగ్గింది. పోటీపై పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. సుధీర్ఘంగా చర్చించారు. తుదకు బద్వేల్ బరి నుంచి తప్పుకోవాలని టీడీపీ నిర్ణయించింది. చనిపోయిన ప్రజా ప్రతినిధి కుటుంబం నుంచి అభ్యర్థి పోటీలో ఉంటే.. సాంప్రదాయం ప్రకారం పోటీ చేయకూడదని పొలిట్ బ్యూరో సమావేశంలో టీడీపీ నేతలు నిర్ణయించారు. పొలిబ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సమావేశం అనంతరం టీడీపీ అధికారికంగా ప్రకటించింది.

జనసేన పార్టీ కూడా బద్వేల్ ఉప ఎన్నిక బరినుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతపురంలో జరిగిన జనసేన బహిరంగ సమావేశంలో ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. చనిపోయిన ఎమ్మెల్యే గౌరవార్థం పోటీ నుంచి తప్పుకుంటున్నామని పవన్ స్పష్టం చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి చెందిన వారికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఇదిలాఉంటే.. బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు బీజేపీ సై అంటోంది. మిత్రపక్షమైన జనసేన పోటీకి నై అనగా.. బీజేపీ మాత్రం సై అంటోంది. ఇందులో భాగంగా ఇవాళ కడప జిల్లా నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు భేటీ అయ్యారు. బద్వేల్‌లో బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని, ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి తెలియజేశామని సోము వీర్రాజు తెలిపారు. స్థానికంగా ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Also read:

Actress Khushbu : వయసు పెరుగుతున్నా.. తరగని అందంతో మతిపోగొడుతున్న సీనియర్ బ్యూటీ..

Shahrukh Khan: నా కొడుకు మంచివాడిగా ఉంటె ఇంట్లోంచి తరిమేస్తాను.. పాపం షారూక్.. అప్పుడు సరదాగా అన్న మాట.. ఇప్పుడు నిజమైంది!

KKR vs SRH Live Score, IPL 2021: హైదరాబాద్‌కు మరో విజయం దక్కేనా.. కోల్‌కతా టీం ప్లే ఆఫ్‌కు అవకాశం లభించేనా?