Rajeev Rayala |
Updated on: Oct 03, 2021 | 6:47 PM
అలనాటి అందాల తారల్లో తరగని అందంతో కవ్విస్తున్నారు ఖుష్బూ..
తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి అలరించిన ఖుష్బూ...
తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మొదటి సినిమా కలియుగపాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు
ఆతర్వాత స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా మారిపోయారు.
ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్రను వేశారు ఖుష్బూ..
గత కొంతకాలం గా సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఖుష్బూ . ఇప్పుడు రజినీకాంత్ అన్నతే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఖుష్బూ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో ఖుష్బూ వయసు సగానికి పైగా తగ్గినట్టు కనిపిస్తుంది. ఇప్పటికి అదే గ్లామర్ తో కవ్విస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్.