ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం వేగవంతం చేసింది. వచ్చే ఎన్నికల కోసం ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. దీనికోసం భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ ప్రణాళికలు సిద్దం చేసింది. జనవరి 5 నుంచి 29 వరకూ మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈనెల 18 మినహా మిగిలిన అన్ని రోజుల్లో సభలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ప్రతి రోజూ రెండు సభలు జరగనున్నాయి. అయితే ఈ సభలకు రా.. కదలిరా అనే పేరు పెట్టారు టీడీపీ నాయకులు. ఇదే పేరుతోనే అన్ని సభలు నిర్వహిస్తామంటున్నారు. ప్రతి సభలో చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగనున్నాయి. ఈ బహిరంగ సభలకు కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.