
తెలుగు రాష్ట్రాల్లో రాత్రి వేళ చలి తీవ్రత తగ్గింది.. నెమ్మదిగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. గత రెండు రోజులుగా ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాలేదు. దిగువ పొరలలో, ఉత్తర భారతదేశం నుండి పొడి గాలులు ఈ ప్రాంతంపై వీస్తున్నాయి. అందువల్ల, 2026 జనవరి 19వ తేదీ, ఈ రోజు నుండి ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో ఈశాన్య రుతుపవన వర్షాలు నిలిచిపోయాయి. రాబోయే రెండు రోజులలో ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:-
సోమవారం, మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. మోస్తరు పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. మోస్తరు పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
సోమవారం, మంగళవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గమనిక :- రాగల 5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు ఉండదు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా తూర్పు/ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నవి. వీటి ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుండి 3°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.