East Godavari: ఇది కంపోస్ట్ ఎరువు అనుకుంటున్నారేమో.. నిజంగా ఏంటో తెలిస్తే కళ్లు బైర్లే..

మాయగాళ్లు, మోసగాళ్లు, కల్తీగాళ్లు సొసైటీలో రోజురోజుకు పెరిగిపోతున్నారు. స్పేస్ దొరికితే చాలు తమ క్రియేటివిటీ ప్రదర్శిస్తూ.. సామాన్య జనంతో ఆడుకుంటున్నారు... ఈ వార్త చదివితే మీ కడుపులో దేవుతుంది జాగ్రత్త సుమా...!

East Godavari: ఇది కంపోస్ట్ ఎరువు అనుకుంటున్నారేమో.. నిజంగా ఏంటో తెలిస్తే కళ్లు బైర్లే..
Adulterated Tea Powder
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 13, 2024 | 6:30 PM

పైన ఫోటోలో మీరు గుట్టలా పోసిన ఓ పదార్థాన్ని చూశారుగా…  ఈ గుట్ట దేనికి సంబంధించిందని మీరు అనుకుంటున్నారు?పొలానికి వేసే ఎరువు అనుకుంటున్నారా? గ్రామాల్లో పశువుల కొట్టం ముందు ఉండే కుప్ప అనుకుంటున్నారా… లేక వర్మి కంపోస్ట్‌ ఎరువు అనుకుంటున్నారా? సరే.. మీరు ఈ కుప్పను చూసి ఏదో ఒకటి అనుకునే ఉంటారు. కానీ మీరు అనుకున్నది కానే కాదు.

ఇది ఒక కల్తీ ప్రొడక్ట్‌. మీరు ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయే వరకు రోజుకు మినిమం రెండు, మూడు , నాలుగు సార్లు తీసుకుంటారు. ఇప్పుడు మైండ్‌కు తట్టింది కదూ.. యస్.. ఇది చాయ్‌పత్తాయే.. కల్తీ చాయ్‌పత్తా.. అదేనండీ టీ పొడి. చెత్తలా ఎలా పోశారో చూశారుగా. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపఎర్రంపాలెంలో నకిలీ టీ పొడి గుట్టు రట్టయింది. రైస్ మిల్లులో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తోన్న కల్తీ టీ పొడి ఇది. దాదాపు వెయ్యి కిలోల కల్తీ చాయ్‌పత్తాను పోలీసులు సీజ్ చేశారు. టీ పొడి శాంపిల్స్‌ను టెస్ట్‌ కోసం ల్యాబ్‌కు పంపారు . ఈ నకిలీ టీ పొడే రేపు అందమైన ఆకర్షణీయమైన బ్రాండెడ్‌ కవర్స్‌లో ప్యాక్‌ అయి మన ఇంట్లో చేరుతుంది. మనల్ని రోగాల బారిన పడేస్తోంది.

చింతపిక్కల పొడి, జీడి పిక్కల పొడి, బేకింగ్ సోడా, బ్లాక్‌ ఫుడ్ కలర్‌, కొబ్బరి పీచు, పంచదార పాకం.. కొన్ని రకాల రసాయనాలు కలిపి టీ పొడి కలరింగ్‌ ఇచ్చి ప్యాక్‌ చేసి పంపుతారు. ఈ కల్తీ పొడితో చేసిన టీ తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఇంతే కాదు తూకం కోసం ఇనుప రజను సైతం ఇందులో కలిపేస్తారు.

నకిలీ టీ పౌడర్‌ను ఎలా గుర్తించాలంటే..

======

1. ఒక గ్లాసు నీటిలో టేబుల్​స్పూన్​ టీ పౌడర్​ కలపాలి

2.నకిలీ టీ పొడి అయితే నీళ్లు త్వరగా రంగు మారుతాయి

3.టీ పొడి నీళ్లలో ముద్దముద్దగా మారుతుంది

4.స్వచ్ఛమైన టీ పొడి వాటర్​లో వేస్తే నీళ్లు త్వరగా రంగు మారవు

5.స్వచ్ఛమైన టీ పొడి నీటి అడుగు భాగాన చేరుతుంది

6. టీ పొడి ప్యాక్ ఓపెన్ చేయగానే వాసన తేడాగా.. ఘాటుగా వస్తే ఆ పొడిని వాడకపోవడమే మంచిది

తినే తిండి కల్తీ, తాగే చాయ్‌ కల్తీ చేస్తున్నారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!