టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఏప్రిల్5న(బుధవారం) రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆయన పాదయాత్ర ముందుకు సాగింది. ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో లోకేశ్ కు ప్రమాదం తప్పింది. పాదయాత్ర సందర్భంగా కూడేరులో టీడీపీ అభిమానులు లోకేశ్ ను గజమాలతో సత్కరించే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ గజమాలను క్రేన్ సహాయంతో లోకేశ్ కు వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో క్రేన్ వైర్లు తెగాయి. దీంతో, మాల ఆయనపై పడిండి. అయితే లోకేశ్ వెంటనే అప్రమత్తమైన తప్పించుకున్నారు. దీంతో, ఆయనకు ప్రమాదం తప్పింది. లోకేశ్ కు ఏమీ కాకపోవడంతో అక్కడున్న టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..