విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న TDP.. బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు పక్కాగా లెక్కలు వేస్తోంది. మధ్యాహ్నం విశాఖ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇప్పటికే YCP అభ్యర్థిగా బొత్స పేరు ఖరారైంది. ఆయనకు పోటీగా గండి బాబ్జి లేదా పీలా గోవింద్‌ను నిలబెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. వెలమ లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపాలని.. ఆ ఈక్వేషన్ కలిసొస్తుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. వెలమ వర్గం నుంచి గండి బాబ్జీ ఉన్నారు. గవర సామాజిక వర్గం నుంచి పీలా గోవింద్ కూడా ఇప్పుడు రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరి పేరు ఫైనల్ అవుతుంది.. విశాఖ నేతలు అధినేతకు ఏం చెప్పబోతున్నారు అనేదానిపై సాయంత్రానికి క్లారిటీ రానుంది. ఇవాళే అభ్యర్థిని ఫైనల్ చేయబోతున్నారు.
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల్లో YCPకే మెజార్టీ ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రజాప్రతినిధుల్లో చాలా మంది కూటమివైపు చూస్తున్నారు. ఇటీవలే GVMC స్టాండింగ్ కౌన్సిల్‌లో కూటమి విజయం సాధించింది. పార్టీ మారకపోయినా కొందరు క్రాస్ ఓటింగ్ చేసి మరీ అటుపక్క ఓటు వేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లోనూ ఇదే రిపీట్ అవుతుందని TDP అంచనా వేస్తోంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని MPTCలు, ZPTCలతో చర్చలు కూడా జరిగాయి. క్యాంప్ రాజకీయం మొదలుకాకపోయినా.. మెజార్టీ ఓట్లు తమకు పడేలా చూసుకునేందుకు తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థి గండి బాబ్జినా లేదంటే పీలా గోవిందా అనేది తేలితే.. స్థానిక సమరం మరింత రసకందాయంగా జరిగేలా కనిపిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..