Andhra Pradesh: మూడేళ్లలో ఏం చేశారు?.. సీఎం జగన్‌పై ఫైర్ అయిన చంద్రబాబు..
Andhra Pradesh: మూడేళ్లలో ఏం సాధించారని ప్లీనరీ పెట్టారంటూ వైసీసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు.
Andhra Pradesh: మూడేళ్లలో ఏం సాధించారని ప్లీనరీ పెట్టారంటూ వైసీసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. శుక్రవారం నాడు నగరిలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించింది. నూలు దారం దండ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దమ్ముంటే ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. జనంలోకి జగన్ వస్తే ప్రజల ఆగ్రహం అర్థం అవుతుందని, పోలీసులను పెట్టుకుని తిరగడం కాదని విమర్శించారు. పోలీసులను పెట్టుకుని తిరగడం కాదని ఎద్దేవా చేశారు. ముద్దులు పెడుతూ తిరిగిన జగన్.. ఇప్పుడు పిడిగుడ్డులు గుద్దుతున్నాడని చంద్రబాబు తీవ్ర కామెంట్స్ చేశారు. జగన్‌పై తనకేమీ కోపం లేదని, రాష్ట్రం మీద ప్రేమనే తన బాధన అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. క్విట్ జగన్ అంటూ నినదించారు.
ఉడుతతో కరెంట్ తీగలు తెగుతాయి.. ఎలుకలు మద్యం తాగుతాయట.. తేనెటీగలు రథాన్ని తగుల బెట్టాయట.. ఇలాంటి ఘటనలతో జగన్ తెలివైన నాయకుడని నిరూపించారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 10వ తరగతి పరీక్షల పలితాల వల్ల జరిగిన స్టూడెంట్స్ సూసైడ్స్ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. కేసులకు, క్లైమోర్ మైన్స్‌కు భయపడలేదని, పెగాసెస్ టెక్నాలజీపై కేసు పెడతాడట అని అన్నారు. పెగాసెస్ దుర్వినియోగం అయ్యిందని చెబుతున్నారని, టెక్నాలజీ గురించి తనకే పాఠాలు నేర్పుతారా? అని వైసీసీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
ఆడబిడ్డలపై జరుగుతున్న దాడులను దిశ యాప్ ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు చంద్రబాబు. రివర్స్ టెండర్ అన్న జగన్.. ఇప్పుడు డ్రైవింగ్ రాకపోయినా రివర్స్ డ్రైవింగ్ చేస్తున్నారని విమర్శించారు. రైతుల పంటకు మద్ధతు ధర ఇచ్చారా? వ్యవసాయానికి పనిముట్లు ఇచ్చారా? విత్తనాలు పంపిణీ చేశారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హామీల వర్షం.. వ్యవసాయానికి పెట్టే మీటర్లను తాము అధికారంలోకి రాగానే తీసివేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. అలాగే, 500 యూనిట్ల వరకు పవర్ లూమ్స్ కు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. కాలుష్య రహిత నగరి గా మార్చి టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. మద్యం ధరలు పెంచడం వల్ల జగన్ కు వ్యక్తిగత ఆదాయం పెరిగిందని ఆరోపించిన ఆయన.. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్ని పన్నులు పెంచిన ప్రభుత్వం.. మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటటం లేదని ఎద్దేవా చేశారు.