CM Jagan Birthday: సీఎం వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. ట్వీట్టర్ వేదికగా వెల్లడి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

CM Jagan Birthday: సీఎం వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. ట్వీట్టర్ వేదికగా వెల్లడి!
Chandrababu Wishes To Jagan

Edited By: Anil kumar poka

Updated on: Dec 22, 2021 | 12:50 PM

Chandrababu birthday wishes to ap cm ys jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. బర్త్ డే సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలతో సహా, తెలుగు రాష్ట్రాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటూ పలువురు ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ‘ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..’అంటూ ట్వీట్ చేశారు. జగన్‌ను ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.

Read Also….  CM Jagan Birthday Celebrations: అధిపతికి పుట్టినరోజు శుభాకాంక్ష‌లు.. లైవ్ వీడియో