Kesineni Nani: ఏపీలో కరోనా కల్లోలం.. టీడీపీ ఎంపీ కేశినేని నానికి కోవిడ్ పాజిటివ్..

|

Apr 16, 2021 | 1:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల..

Kesineni Nani: ఏపీలో కరోనా కల్లోలం.. టీడీపీ ఎంపీ కేశినేని నానికి కోవిడ్ పాజిటివ్..
Kesineni Nani
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

” నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారంతా క్వారంటైన్‌లో ఉండాలని.. కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి” అని ట్వీట్ చేశారు.

కేశినేని నాని ట్వీట్ ఇదే…

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు…

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,086 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,42,135 మంది వైరస్‌ బారినపడినట్లు ఏపీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న కోవిడ్‌ రాకాసి కోరలకు 14 మంది ప్రాణాలను వదిలారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,353కి చేరింది. ఇక, 24 గంటల వ్యవధిలో 1,745 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,03,072కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొంది. మొత్తంగా చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,70,201 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..