AP Assembly: రెండో రోజూ TDP సభ్యుల అవుట్.. ఆగ్రహంతో ఊగిపోయిన సభాపతి.. అసలు ఏమైందంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా టీడీపీ, వైసీపీ మధ్య వార్ కొనసాగింది. పెరిగిన ఛార్జీలు, పన్నులపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా..

AP Assembly: రెండో రోజూ TDP సభ్యుల అవుట్.. ఆగ్రహంతో ఊగిపోయిన సభాపతి.. అసలు ఏమైందంటే..
Ap Assembly Speaker
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 16, 2022 | 3:02 PM

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా టీడీపీ, వైసీపీ మధ్య వార్ కొనసాగింది. పెరిగిన ఛార్జీలు, పన్నులపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఇరుపక్షాల వారు గట్టిగా కేకలు వేసుకున్నారు. ఈ సందర్భంగా వెల్ లోకి టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లి.. స్పీకర్ తమ్మినేని సీతారాంను చుట్టుముట్టారు. దీంతో శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ సభ్యులపై ఒకరోజు స్పీకర్ సస్పెన్షన్ విధించారు. దీంతో రెండో రోజూ కూడా శాసనసభ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. అసెంబ్లీ ప్రవర్తన నియమావళి సబ్‌ రూల్‌ 2 ప్రకారం బెందాళం అశోక్‌ , అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చిన్నరాజప్ప, జోగేశ్వరావు , పయ్యావుల కేశవ, మంతెన రామరాజు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయులు వెలగపూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్‌లను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.

ఈ సందర్బంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, టీడీపీ సభ్యుల ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మండిపడ్డారు. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. సభలో మీరు మాత్రమే సభ్యులా? ఇతరులు సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని… దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను స్పీకర్ కోరారు. మొత్తం మీద ఒకరోజు సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

Latest Articles