Nandamuri Balakrishna: సీమలో బాలయ్య.. అక్కడి పరిస్థితులపై తీవ్ర అసహనం

|

Oct 18, 2021 | 11:15 AM

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.

Nandamuri Balakrishna: సీమలో బాలయ్య.. అక్కడి పరిస్థితులపై తీవ్ర అసహనం
Balayya
Follow us on

హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్యంతో పాటు వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. నేరుగా పేషెంట్ల వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. గతంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి బాలయ్య తన సొంత ఖర్చులతో వెంటిలేటర్లు అందజేశారు. వాటి పని తీరు గురించి కూడా ఆరా తీశారు. అయితే కొందరు పేషెంట్లు ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉండటం లేదని.. ప్రైవేటు క్లీనిక్ లకు వెళ్తూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నాలుగు రోజుల క్రితం తమ బిడ్డ చనిపోయిందని బాలక్రిష్ణకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తాను చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ. గతంలో తాము అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆసుపత్రి పనీతీరులో చాలా తేడా ఉందన్నారు.

 

సీమ జలాలపై అవసరమైతే ఢిల్లీ స్థాయిలో ఉద్యమం

అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రౌంట్ టేబుల్ సదస్సులో బాలయ్య మాటలు చాలా స్పష్టంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. హంద్రీనీవా నుంచి చెరువులకు నీళ్లు అందించే విషయం నుంచి గోదావరి-పెన్నా అనుసందానం వరకు విషయాన్ని చాలా వివరంగా వివరించారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతూ..నీరు ఇచ్చే పరిస్థితి లేకుండా చేస్తున్నారంటూ ప్రత్యర్ధులపై చురకలూ అంటించారు… సీమ కోసం మిగులు జలాలు కాదు…నికర జలాలు కావాలని డిమాండూ చేశారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని..హర్యానా తరహాలో ఉద్యమం చేస్తామని..అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఉద్యమిస్తామంటూ గర్జించారు.

Also Read:  పండక్కి అత్తగారింటకి వచ్చి బైక్స్‌కు ఫైన్ వేసిన ఎస్సై… గ్రామస్తులు ఏం చేశారంటే

చేపల కోసం వల.. అబ్బా ఈరోజు పండుగే అనుకున్నాడు.. అంతలోనే షాక్