విజయవాడలో పొలిటికల్ ఫైట్ తారా స్థాయికి చేరుకుంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకునేదాకా వెళుతున్నారు. తాజాగా చేరికల విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం రాజుకుంది. ఇది చిలికి చిలికి గాలివానలా మారింది. తూర్పు నియోజకవర్గంలోని రాణిగారి తీట నుంచి గొల్లు రమేష్ అనే వ్యక్తి టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. గతంలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ నేత అరవ సత్యంపై పోటీ చేసి కొద్దిపాటి ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి ఈ రమేష్. అతను ఇప్పుడు టీడీపీలో చేరుతుంటే దేవినేని అవినాష్ అనుచురుడు సత్యం అడ్డుకుంటున్నారన్నది బుద్ధా వెంకన్న, గద్దె రామ్మోహన్ విమర్శ. అంతేకాదు.. హత్య పేరుతో రమేష్‌పై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు కాగా ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు అరవ సత్యం.
బుద్దా వెంకన్న, గద్దె రామ్మోహన్ ఇద్దరూ జోగులని.. వాళ్లే లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హత్యలు- రాజకీయాలు అని లేనిపోని మాటలు పుట్టిస్తే పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..