Varla Ramaiah – Nilam Sawhney : ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కలిశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ పై ఎస్ఈసీ సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోందని ఆయన నీలం సాహ్నితో అన్నారు. అయితే, గత మార్చిలో ఎన్నికల సమయంలో వైసీపీ దౌర్జన్యాలు చేసిందని ఈ దఫా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అలా జరుగకుండా చూడాలని ఆయన నీలం సాహ్నిని కోరారు. అధికార పార్టీ బలవంతంగా ఏక గ్రీవాలు చేసుకున్నారని ఆయన ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. 24 శాతం ఏకగ్రీవాలు అయ్యాయని వర్ల చెప్పుకొచ్చారు.
పాత నోటిఫికేషన్ రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా తాము అప్పట్లో ఈసీని కోరామని, ఈ అంశం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా వెళ్లిందని వర్ల కొత్త ఎస్ఈసీ కి విన్నవించారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే.. అది ఒక ఫార్స్ గా మిగిలిపోతుందని.. అప్రజాస్వామికంగా జరిగే ఎన్నికలు అయ్యే ప్రమాదం కూడా ఉందని వర్ల కొత్త ఎన్నికల కమిషనర్ తో మొరపెట్టుకున్నారు.
Read also : Vijayashanthi : నాపై అక్రమ కేసులు పెట్టి, భయాందోళనకు గురి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు : విజయశాంతి