టీడీపీ అధినేత చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టుల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఈమేరకు ఆయనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం యంత్రాంగం వైసీపీ వారి పట్ల ఒక విధంగానూ, ప్రతిపక్ష పార్టీల పట్ల మరో విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. తమ నాయకుడిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు, చర్యలు చేస్తే ఊరికోమని హెచ్చరించారు.
కాగా ఈ పోస్టులపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్పందించారు. ప్రభుత్వాన్ని విమర్శించే టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి.. అరెస్టులు చేస్తున్నారు. మరి ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. ‘ప్రభుత్వాన్ని విమర్శించే తెలుగుదేశం కార్యకర్తలను.. అర్థరాత్రి అరెస్టు చేసే పోలీసులు.. తెలుగుదేశం మహిళా నేతలను కించపరుస్తూ, వైకాపా వాళ్ళు మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులు పెడితే మాత్రం చర్యలు తీసుకోరు. అందుకే ఈరోజు ఇలాంటి పోస్టులు చూడాల్సి వస్తోంది. ‘కరోనా వైరస్ వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ వ్యక్తి చనిపోయారని.. కుర్చీలో చంద్రబాబు ఫొటోకి.. దండవేసివున్న ఫొటో’ను పోస్ట్ చేశారు.
ప్రభుత్వాన్ని విమర్శించే తెలుగుదేశం కార్యకర్తలను అర్థరాత్రి అరెస్టు చేసే పోలీసులు… తెలుగుదేశం మహిళా నేతలను కించపరుస్తూ, వైకాపా వాళ్ళు మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులుపెడితే మాత్రం చర్యలు తీసుకోరు. అందుకే ఈరోజు ఇలాంటి పోస్టులు చూడాల్సివస్తోంది. #YCPPayTMBatch pic.twitter.com/8yuPVEKwH6
— Telugu Desam Party (@JaiTDP) March 17, 2020
Read More this also:
హీరోయిన్ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..
దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం!