Nara Lokesh: పక్కరాష్ట్రం పాలనపై తెలంగాణ(Telangana) ఐటీ మంత్రికేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టిడిపి(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. కేటీఆర్ నోట.. జగన్ విధ్వంసపాలన మాట.. అట్టుంటది ఒక్క చాన్స్ తోని… అంటూ కేటీఆర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభ సమయంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీలో సరిగా రోడ్లు లేవని , కరెంట్ లేదని ..నీళ్లు కూడా లేవని అన్నారు.హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. మరో 10 నుంచి 15 ఏళ్ల వరకూ హైదరాబాద్‌కు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మౌలిక సదుపాయలపరంగా హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కేటీఆర్ నోట…జగన్ విధ్వంసపాలన మాట..
అట్టుంటది ఒక్క చాన్స్ తోని.. pic.twitter.com/qWKF5ADJLj
— Lokesh Nara (@naralokesh) April 29, 2022
అంతేకాదు ఆ రాష్ట్రంలో కరెంట్ లేదు. చీకట్లు, నీళ్లు లేవు. రోడ్లు ధ్వంసమయ్యాయి ఇతర వసతులు లేవని ఈ సందర్భాంగా కేటీఆర్ అన్నారు. కొద్ది రోజుల క్రితం తన మిత్రుడు పండగకు ఏపీ వెళ్లివచ్చారు. వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేసి.. తాను 4 రోజులు ఉన్నాను….అక్కడ కరెంట్ లేదు,నీళ్లు లేవు,రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తన స్నేహితుడు తెలంగాణలోని వాళ్ళను నాలుగు రోజులు బస్సుల్లో ఏపీకి పంపండి…తెలంగాణ సర్కార్ ఏమి చేస్తుందో విలువ తెలుస్తుందని అన్నారని కేటీఆర్ చెప్పారు. తాము మళ్లీ హైదరాబాద్ వచ్చేవరకు ప్రశాంతంగా ఉండలేకపోయామన్నారు. వాళ్లకు అక్కడికెళ్లిన తర్వాత అర్థమైందని చెప్పారు. ఇలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియో ను నారా లోకేష్ షేర్ చేశారు.
Also Read: Viral Photo: ప్రేమా లేక యుద్దమా? ఈ ఫోటోలో మొదట ఏం చూశారో అదే మీ వ్యక్తిత్వ లక్షణం!
Anantapuram: నారా లోకేష్‌పై ఎవరు దాడి చేయలేదు.. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు