Nara Lokesh: ‘ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోయింది’: నారా లోకేష్
'జగన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోయింది' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
Lokesh: ‘జగన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోయింది’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఇవాళ అమరావతిలో వ్యాఖ్యానించారు. “ఆడబిడ్డల్ని బయటకి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. విశాఖజిల్లా అచ్యుతాపురం మండలం కడపాలెంలో తండ్రీ, కొడుకులు మృగాళ్లా మారి బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.” అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.
బాధితులే నిందితుల్ని గుర్తించాలనే మహిళా హోంమంత్రి అసమర్ధ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని లోకేష్ చెప్పుకొచ్చారు. కనీసం ఒక్క ఘటనలో కూడా నిందితులకు శిక్ష పడకపోవడం వల్లే కామోన్మాదులు రెచ్చిపోతున్నారన్నారు. మీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కోసం పోలీసుల్ని వాడుకోవడం మానేస్తే, కనీసం వారు నిందితులనైనా పట్టుకుంటారు.. అంటూ లోకేష్ విమర్శించారు.
విశాఖజిల్లా అచ్యుతాపురం మండలం కడపాలెంలో తండ్రీ, కొడుకులు మృగాళ్లా మారి బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. బాధితులే నిందితుల్ని గుర్తించాలనే మహిళా హోంమంత్రి @SucharitaYSRCP అసమర్ధ వ్యాఖ్యలు..,(2/3)
— Lokesh Nara (@naralokesh) September 14, 2021