Andhra Pradesh: మంత్రుల బస్సు యాత్రపై ప్రజలు రాళ్ల దాడి చేయొచ్చు.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్య

|

May 22, 2022 | 1:25 PM

వైసీపీ పాలనపై టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC.Prabhakar Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ పాలనలో జరుగుతున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని ఫైర్ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో....

Andhra Pradesh: మంత్రుల బస్సు యాత్రపై ప్రజలు రాళ్ల దాడి చేయొచ్చు.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్య
Jc Prbhakar Reddy
Follow us on

వైసీపీ పాలనపై టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC.Prabhakar Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ పాలనలో జరుగుతున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని ఫైర్ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏం జరుగుతుందో చూస్తున్నామన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. మంత్రుల బస్సు యాత్రకు పోలీసు రక్షణ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లేకపోతే ప్రజలు రాళ్లు విసిరే అవకాశం ఉందని మండిపడ్డారు. తమ పార్టీ నేత కాలవ శ్రీనివాసులును(Kalava Srinivasulu) రాయదుర్గంలోని ఆలయానికి వెళ్లనీయకపోవడాన్ని చూస్తుంటే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్న విషయం అర్థమవుతోందని ఆక్షేపించారు. పోలీసుల నీడలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు అరాచకాలు చేస్తున్నారు. త్వరలో కాలవ శ్రీనివాసులుతో కలిసి రాయదుర్గం ఆలయానికి వెళతానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలను గాలికొదిలేశారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్​రెడ్డి అన్నారు. గడపగడపకు కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు తప్ప.. ఒక్క కార్యకర్త కూడా ఎమ్మెల్యేల వెంటలేరని ఆయన గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే “గడప గడపకు మన ప్రభుత్వం” పేరుతో ప్రతి ఇంటికి వెళ్తున్న మంత్రులు ఇప్పుడు మరో రకమైన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. విశాఖపట్నం నుంచి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింతగా వివరించేందుకు, విస్తృత ప్రచారం చేసేందుకు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

AP DME Recruitment 2022: 149 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నోటిఫికేషన్‌.. అర్హతలివే..

Rajendra Prasad: హిట్ కాకపోతే మీ ముందు నిలబడను.. రాజేంద్రప్రసాద్ ఆసక్తకికర వ్యాఖ్యలు..