Andhra Padesh: టీడీపీ బలపడడం ఓర్వలేకే.. చంద్రబాబు వాహనంపై దాడిని ఖండించిన మాజీ హోం మంత్రి

చంద్రబాబు వాహనంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని  చినరాజప్ప డిమాండ్‌ చేశారు. ఈఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Andhra Padesh: టీడీపీ బలపడడం ఓర్వలేకే.. చంద్రబాబు వాహనంపై దాడిని ఖండించిన మాజీ హోం మంత్రి
Chinarajappa, Chandrababu

Updated on: Nov 04, 2022 | 9:06 PM

చంద్రబాబు వాహనంపై దాడిని మాజీ హోంమంత్రి చిన రాజప్ప ఖండించారు. రాష్ట్రమంతటా టీడీపీ బలపడటం ఓర్వలేక అధికార వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారన్నారు. చంద్రబాబు వాహనంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని  చినరాజప్ప డిమాండ్‌ చేశారు. ఈఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఫై దాడిని ఖండించారు. ఎన్టీఆర్ జిల్లా, నందిగామలో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరగటం పోలీసుల వైఫల్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. రాజకీయాల్లో భౌతిక దాడులు సరికాదని, దాడికి పాల్పడిన వారిని తక్షణం గుర్తించి, కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరోవైపు చంద్రబాబు సరికొత్త నాటకానికి తెరతీశారని మంత్రి జోగిరమేశ్‌ మండిపడ్డారు. రాయి విసిరించుకోవడం చంద్రబాబు కుట్ర కోణం లో భాగమేనని అభిప్రాయపడ్డారు.

‘ఒక రాయి సెక్యూరిటీ అధికారి పై పడి గాయం అవడం బాధాకరం. రాయి విసిరించుకోవడం చంద్రబాబు కుట్ర కోణం లో భాగం. దెబ్బ తగిలినఅధికారికి క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబు. రాయిని చంద్రబాబే విసిరించుకున్నారు. గతంలో జగన్ ను అరెస్ట్ చేసినా కూడా శాంతి యుతంగా ప్రజల మనసు గెలుచుకున్నారు. మేము రాళ్లు వేసి విధ్వంసం సృష్టిస్తామా? 152 స్థానాల నుండి 175 స్థానాలకు వెళ్లాలని జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. బంద్‌లో నాలుగు బస్సులు తగల బెట్టకపోతే అది బందే కాదని చంద్రబాబు చెప్పారని దగ్గుపాటి పుస్తకంలో రాశారు. రాయి విసిరించుకునే కుయుక్తులు చంద్రబాబు వి. పార్ట్ వన్ రెక్కీ,పార్టీ టు రాయి. రెక్కీ అని హదా విడి చేస్తే కొంత మంది తాగి గలాట చేశారని తెలంగాణా పోలీసులు తేల్చారు. రెక్కీ చేయాల్సిన అవసరం,రాయి వేయాల్సిన అవరం మాకేముంది. ప్రభుత్వ పథకాలను గడప గడపకు ప్రభుత్వం ధ్వారా ప్రజలకు చేరువ చేసే పనిలో ఉన్నాం. ఇక ఇప్పటం వెళ్లి పవన్ ఏంటి చేసేది? నోటీసులు ముందుగానే ఇస్తే ముందుగానే అన్నీ కులాల వారు ఖాళీ చేశారు. రేపు ఇప్పటంలో పార్ట్ త్రీ జరగబోతుంది. శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలనే కుట్ర జరుగుతోంది. భూమిని అయ్యన్న పాత్రుడు కబ్జా చేస్తే చంద్రబాబు సమర్ధిస్తున్నారు. మల్లెల బాబ్జి ఎన్టీఆర్ పై కత్తి తో దాడి చేసేలా ఎవరూ ప్రేరేపించారో అందరికి తెలుసు. 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి ఉందా? ఇద్దరు కూడబలుక్కుని జగన్ ను ప్రజల నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రాయికి విసిరించుకునే కథ కు స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించిన చంద్రబాబు కుట్రను బయట పెడతాం. దీని పై విచారణ జరిపి అసలు విషయం బయటకు తీయాలని డీజీపీని కోరుతున్నాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..